OTT Movie : కొంతమంది దేవుడి పేరుతో చేసే మోసాలు, క్రూరమైన నేరస్తులు చేసే నేరాలకన్నాఘోరంగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు ఎక్కడపడితే అక్కడ ఉన్నారు. అటువంటి వాళ్ళను ఆధారంగా చేసుకుని, చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా హాలీవుడ్ నుంచి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి దేవుడి పేరు చెప్పుకుని, మహిళల్ని మోసం చేస్తుంటాడు. ఈ సినిమాలో క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
రెండు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది అదర్ లాంబ్’ (The Other Lamb). 2019 లో వచ్చిన ఈ మూవీకి మాగోర్జాటా షుమోవ్స్కా దర్శకత్వం వహించారు. సి.ఎస్. మెక్‌ముల్లెన్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా తీయబడింది. ఈ స్టోరీ సెలా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ఫ్లిక్స్ (Netflix ) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
షెపర్డ్ అనే వ్యక్తి దైవ దూతగా చెప్పుకుంటూ, అడవి ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. అక్కడ ఒంటరి మహిళలను దేవుడి పేరుతో దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అలా వచ్చిన అందమైన తొమ్మిది మంది మహిళలను పెళ్ళికూడ చేసుకుంటాడు. వాళ్ళతో శారీరకంగా కలసి పిల్లల్ని కూడా కంటాడు. అక్కడ ఎరుపు రంగు దుస్తులు ధరించే వాళ్ళు భార్యలుగా, నీలం రంగు దుస్తులు ధరించే వాళ్ళను కుమార్తెలుగా ఉంచుతాడు. షెపర్డ్ ఈ మహిళలను పూర్తిగా నియంత్రిస్తుంటాడు. ఈ క్రమంలో సెలా అనే అతని కుమార్తె, షెపర్డ్ దీవెనలు పొందాలని ఆరాటపడుతూ ఉంటుంది. అయితే ఆమె పెరిగే కొద్దీ, అతని వక్ర దృష్టి ఆమెపై పడుతుంది. ఆమెను కూడా తన భార్యని చేసుకోవాలి అనుకుంటాడు. మరోవైపు సెలా తన తల్లి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. సెలా పుట్టినప్పు డే తల్లి చనిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళే ఆమెను పెంచి ఉంటారు.
ఇది ఇలా ఉండగా, ఒక సారి అక్కడికి పోలీసులు వచ్చి, వీళ్ళను హెచ్చరించి ఖాళీ చేయమని చెప్తారు. ఈ సమూహం తమ స్థలాన్ని వదిలి, కొత్త ప్రాంతం కోసం ప్రయాణం మొదలు పెడతారు. ఈ ప్రయాణంలో సెలా షెపర్డ్ క్రూర స్వభావాన్ని తెలుసుకుంటుంది. ఈ క్రమంలో సారా అనే ఒక మహిళ, సెలాకు షెపర్డ్ గురించి అసలు నిజాలను చెప్తుంది. ఆమె ఆలోచనలు ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారుతాయి. ఇంతలో షెపర్డ్, సెలాతో కూడా శారీరకంగా గడపడానికి ప్రయత్నిస్తాడు. చివరికి షెపర్డ్ కి సెలా లొంగిపోతుందా ? అక్కడ ఉన్న మహిళలకు విముక్తి లభిస్తుందా ? షెపర్డ్ రహస్యంగా దాచి ఉంచిన రహస్యాలు ఏమిటి ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : మైండ్ గేమ్ తో పిచ్చెక్కించే క్రేజీ కన్నడ మూవీ… గూస్ బంప్స్ తెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్