Flights Cancelled In India: ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారతంలోని పలు విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 వరకు సుమారు 27 విమానాశ్రయాలను క్లోజ్ చేసింది. ఇండో-పాక్ వార్ తరహా వాతావరణంతో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు కొనసాగించే పలు రద్దు అయ్యాయి. దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ విమాన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారుల సమాచారం ప్రకారం.. ఇవాళ మొత్తం 138 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. వాటిలో నాలుగు విమానాలు ఇతర దేశాల నుంచి ఢిల్లీకి వచ్చే రావాల్సి ఉంది. మరో 5 విమానాలు ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ ఎఫెక్ట్ దేశీయ విమానాల మీద కూడా పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రావాల్సిన 63 విమానాలు రద్దు అయ్యాయి. అదే సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి వెళ్లాల్సిన 66 విమానాలను క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయం తెరిచే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. రద్దు అయిన విమానాలకు సంబంధించి ప్రయాణీకులు రీఫండ్ ఇస్తామని విమానయాన సంస్థలు తెలిపాయి.
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 90 విమానాలు రద్దు
ఇక హైదరాబాద్ నుంచి ఉత్తరాది నగరాలకు వెళ్లాల్సిన సుమారు 90కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. వీటిలో శ్రీనగర్, జమ్ము, లేహ్, అమృత్ సర్, చంఢీఘడ్ నగరాలకు నడిచే విమానాలు ఎక్కువగా ఉన్నాయి. రద్దయిన విమానాల సంఖ్య 90కి పైగా ఉంటుందని ఎయిర్ ఇండియా, ఇండిగో ,స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు తెలిపాయి.
Read Also: బాయ్ కాట్ టర్కిష్ ఎయిర్ లైన్స్, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్!
శుక్ర, శనివారాలు విమాన సర్వీసులు రద్దు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి శుక్ర, శనివారాల్లో విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా అమృత్ సర్ కు 10, లేహ్ కు 14, శ్రీనగర్ కు 11, జమ్ముకు 4 నుంచి 5 విమానాలు నడిపేంది. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ కు 12 విమానాలను క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. ఇండిగో సంస్థ మే 10 రాత్రి 11.59 గంటల వరకు 10 నగరాలకు విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రయాణీకులు తమ బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. రీషెడ్యూల్ కోసం కస్టమర్ కేర్ ను సంప్రదించాలని కోరింది. శనివారం రాత్రి 11:59 గంటల వరకు శ్రీనగర్, జమ్మూ, అమృత్ సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్ పూర్, కిషన్ గఢ్, రాజ్ కోట్ కు విమాన సర్వీసులు ఉండవని తెలిపింది.
Read Also: బాయ్ కాట్ టర్కిష్ ఎయిర్ లైన్స్, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్!