OTT Movie : కొత్త కొత్త స్టోరీలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శకులు. నచ్చిన సినిమాలను థియేటర్లకు వెళ్లకపోయినా ఓటీటీ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకుల్ని చివరి వరకు కన్ఫ్యూజ్ చేస్తాయి. స్టోరీ అర్థమవుతున్నట్టు, మరోవైపు అర్థం కానట్టు ఉంటూ తికమక పెడుతుంటాయి. అటువంటి మూవీ ఒకటి ఈరోజు మన మూవీ సజెషన్. మూవీ పేరు, స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది పర్ఫెక్షన్’ (The Perfection). 2018 లో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి రిచర్డ్ షెపర్డ్ దర్శకత్వం వహించారు. ఇందులో అలిసన్ విలియమ్స్, లోగాన్ బ్రౌనింగ్, స్టీవెన్ వెబర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ స్టోరీ సంగీత ప్రపంచంలోని చీకటి రహస్యాలు, ప్రతీకారం, వ్యక్తిగత బాధల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో 2019 మే లో విడుదలైంది.
స్టోరీలోకి వెళితే
చార్లెట్ చిన్నతనంలోనే సంగీత అకాడమీలో వయోలిన్ నేర్చుకుంటూ ఉంటుంది. ఆమె తన తల్లికి అనారోగ్యం కారణంగా సంగీతాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇంటిదగ్గర తల్లిని చూసుకోవడంతోనే సమయం పది సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ తర్వాత చార్లెట్ తల్లి చనిపోతుంది. మళ్లీ సంగీతం నేర్చుకోవడానికి అకాడమీకి వెళ్తుంది చార్లెట్. అయితే అప్పటికే ఎలిజిబెత్ అనే అమ్మాయి అందులో టాప్ పొజిషన్లో ఉంటుంది. ఆమెకు పెద్ద పెద్ద బ్యానర్లు కూడా కట్టి ఉంటారు. ఇది చూసి చార్లెట్ ఆ ప్లేస్ లో నేను ఉండాల్సిన దాన్నని అనుకుంటుంది. అకాడమీలో మళ్లీ తన ప్రయాణం మొదలు పెడుతుంది. ఎలిజబెత్, చార్లెట్ ఇద్దరు కొద్దిరోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళిద్దరూ ఒక వెకేషన్ కి ప్లాన్ చేస్తారు. అక్కడికి వెళ్లే ముందు ఎలిజబెత్ మద్యం బాగా తాగుతుంది. పొద్దున్నే ఎలిజబెత్ కి బాగా హ్యాంగ్ ఓవర్ ఉండటంతో, ఒక టాబ్లెట్ వేసుకోమని చార్లెట్ ఇస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వెకేషన్ కి వెళ్తారు. అప్పటినుంచి ఆమెకు తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్లీ ఓ రెండు మాత్రలు వేసుకుంటుంది.
ఆ తరువాత తన ఒంట్లో నుంచి పురుగులు బయటికి వచ్చినట్టు అవుతుంది. చేతినిండా అవి కనిపించడంతో, చార్లెట్ ఆమెకు ఒక కత్తి ఇస్తుంది. చేసేదేం లేక ఎలిజిబెత్ తన చేయిని కట్ చేసుకుంటుంది. ఆ తర్వాత తను హాస్పిటల్ కి వెళ్తుంది. ఎలిజిబెత్ ఇదంతా చార్లెట్ కావాలనే చేసిందని తెలుసుకుంటుంది. ఎందుకంటే ఆ మాత్రలు మధ్యం తాగిన తర్వాత వేసుకుంటే, లేనివి ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. కావాలనే టాబ్లెట్స్ ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేసిందని బాధపడుతుంది. ఇదంతా ఆ ఇన్స్టిట్యూట్ యజమాని ఆంటోనీకి చెప్తుంది. అప్పుడు ఎలిజబెత్ ప్లాన్ చేసి తనని తాడుతో బంధించి బయటకి తీసుకెళ్తుంది. చివరికి ఫ్లాష్ బ్యాక్ లో ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివిల్ అవుతుంది. నిజానికి ఆంటోని నుంచి కాపాడటానికి, చార్లెట్ ఆ పని చేసి ఉంటుంది. చివరికి గతంలో చార్లెట్ స్టోరీ ఏమిటి? ఎలిజిబెత్ ను ఎందుకు కాపాడాలనుకుంటుంది? ఆంటోని పాత్ర ఇందులో ఎంత ? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ ని చూడండి.