Manchu Lakshmi : సినిమా రంగంలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. టాప్ రేంజ్ లో ఉన్నవాళ్లు సడన్ గా కింద పడిపోతారు. కొందరు ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు. ఇంకొందరు ఎంత ప్రయత్నించినా నిలదొక్కుకోలేరు. అలాగే వాళ్ళ రెమ్యునరేషన్స్ కూడా ఇమేజ్ ని బట్టి తగ్గడం, పెరగడం ఉంటాయి. తెలుగులో స్టార్ హీరోయిన్ కి బాగా ఎక్కువ అనుకుంటే, ఒకప్పుడు కోటికి పైగా ఉండేది. ఆ తర్వాత 10 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. సమంత మంచి ఫామ్ లో ఉన్నప్పుడే రెండు, మూడు కోట్లు తీసుకునేది. నయనతార రెమ్యూనరేషన్ ను ఎవ్వరు బీట్ చెయ్యలేదు.. స్టార్ హీరోలతో సమానంగా తీసుకుంటుంది. కానీ మంచు లక్ష్మీ స్టార్ హీరోయిన్లతో సమానంగా కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మధ్య సినిమాలు ఏవి లేవు కదా.. మరి కోట్లు దేనికి తీసుకుందనే సందేహం కలుగుతుంది కదా.. అదోక వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఒకసారి తెలుసుకుందాం..
వెబ్ సిరీస్ స్టోరీ..
సౌత్ లో ఏకంగా 5కోట్ల రూపాయలు తీసుకొంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేరని అనుకుంటాం. కానీ ఇంత పెద్ద మొత్తాన్ని తీసుకుంటున్న నటి కూడా మన తెలుగు నటి కావడం విశేషంగా చెబుతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఈ ఆ రికార్డు ను బ్రేక్ చేసింద. జీ 5 యాప్ కోసం మిసెస్ సుబ్బలక్మి అనే వెబ్ సిరీస్ కోసం అక్షరాలా రూ. 5 కోట్లు అందుకుంది. ఇది ఆరు భాగాలుగా వచ్చే సిరీస్. అందుకే అంత మొత్తం వచ్చింది.. కానీ అంత అంటే ఎక్కువే కదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటిలో ఇది చాలా ఎక్కువ.. లక్ష్మీ మంచు రికార్డు బ్రేక్ చేసింది.
స్టోరీ విషయానికొస్తే..
నిజానికి దీన్ని సినిమా గా తీయాలని అనుకున్నారట. కానీ వెబ్ సిరీస్ గా మారిపోయింది. సుబ్బలక్ష్మి పాత్రలో మంచు లక్ష్మి కనిపిస్తుంది. డైరెక్టర్, నటుడు అవసరాల శ్రీనివాసరావు కూడా ఇందులో నటిస్తున్నాడు. సుబ్రహ్మణ్యం పాత్రలో కనిపిస్తాడు. ఇందులో నటించడం ఒక్కటే కాకుండా నిర్మాణ పనులు కూడా దగ్గరుండి చూసుకుందట మంచు లక్ష్మీ. అయితే నిర్మాణ పనులతో పోలిస్తే ఐదుకోట్ల తక్కువ కిందే లెక్క. అయినా సరే, ఈ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా చెప్పుకుంటోంది.. ఏది ఏమైనా ఈ మధ్య ఎక్కువగా స్టార్ హీరోయిన్లు ఓటీటీలో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. కానీ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అంటే అది గ్రేట్.. ఇక ప్రస్తుతం లక్ష్మి మంచు ముంబైలో సెటిలైంది. బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పటివరకు బాలీవుడ్ నుంచి పిలుపు రాలేదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏవో సినిమాలో చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలన్న కల నెరవేరుతుందో లేదో చూడాలి…