Dhanaraj : టాలీవుడ్ కమెడియన్ ధనరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా చాలామంది కమెడియన్లు ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ ను పరిచయం చేసింది. అంత మంచి ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన నటులు .. తమదైన రీతిలో వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా.. గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా దూసుకుపోతుండగా.. వేణు డైరెక్టర్ గా మారి.. హిట్ అందుకున్నాడు. ఇక వేణు బాటలోనే ధనరాజ్ కూడా డైరెక్టర్ గా మారాడు. అంతేకాదు నిర్మాతగా కూడా మారి సినిమా చేశారు. ఇటీవల రాఘవం రామం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రీ, కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ తో కన్నీళ్లు పెట్టించాడు. సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేదు కానీ, సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. కెరీర్ పరంగా దూసుకుపోతున్న ధనరాజ్ జీవితంలో అన్నీ కష్టాలే.. ఓ హీరో వల్ల తన జీవితం టర్న్ తీసుకుందని గతంలో చాలా సందర్భాల్లో బయట పెట్టాడు. తాజాగా ధనరాజ్ భార్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఆమె ఏం అన్నారో ఒకసారి తెలుసుకుందాం..
ధనరాజ్ భార్య శిరీష ఇంటర్వ్యూ..
ధనరాజ్ భార్య శిరీష గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనతో కలిసి పలు ఈవెంట్లలో పాల్గొంటూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా శిరీష ధనరాజ్ఎదుర్కొన్న కష్టాలతో పాటు, హీరో చేసిన సాయం గురించి బయట పెట్టింది.. ఆ హీరో గనుక లేకున్నా అంటే మేము ఇప్పుడు ఇలా ఉండే వాళ్ళం కాదు అని అతనిపై ప్రశంసలు కురిపించింది. ఒక సందర్భంలో ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారు కదూ.. ఆయన ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని. ధనరాజ్ కు ఈ హీరోకు మంచి సన్నిహిత్యం ఉన్నంత సంగతి తెలిసిందే.. శిరీష ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మేము అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుందాం అప్పుడే ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మా పెద్ద బాబు సుకురామ్ పుట్టే సమయంలో చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఆ టైంలో హీరో రామ్ మాకు 15 వేల రూపాయలు సాయం అందించారు. అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన లేకున్నా అంటే ధనరాజ్ ఇప్పుడు ఈ స్థానంలో ఉండేవాడే కాదు అని శిరీష చెప్పింది. అప్పటికి ఇప్పటికీ హీరో రామ్ ధన్ రాజు సంబంధం అలానే కొనసాగుతుంది. అంత పెద్ద స్టార్ హీరో అయింది కూడా ధనరాజ్ను తన సొంత స్నేహితుడిగా రామ్ భావిస్తారని చెప్పింది. ఒక్క రామ్ మాత్రమే కాదు డైరెక్టర్ సుకుమార్ కూడా ధనరాజ్ తో మంచి సంబంధం ఉంది. సుకుమార్ ని డాడీ అని పిలుస్తాడని ఆమె చెప్పింది. వీరిద్దరి వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని అందుకే పెద్ద అబ్బాయికి సుకురామ్ అని పెట్టుకున్నట్లు చెప్పారు..
Also Read: వెబ్ సిరీస్ కు మంచు లక్ష్మీ అన్ని కోట్లు తీసుకుందా..?
కన్నీళ్లు తెప్పిస్తున్న ధనరాజ్ లైఫ్ స్టోరీ..
ఇంటర్వ్యూలో మాట్లాడిన శిరీష్.. ధనరాజ్ తల్లి చనిపోయినపుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని ఓ షోలో చెప్పిన విషయం పై క్లారిటీ ఇచ్చింది. వాళ్ళమ్మా క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయింది. ఆ టైంలో ధనరాజ్ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. దహన సంస్కారాలు చేసేందుకు డబ్బుల్లేవు అది అతని జీవితంలో మర్చిపోలేని బాధగా మిగిలిపోయింది అని శిరీష చెప్పారు. ఇప్పుడు మేము పర్వాలేదు ఇద్దరం ఎవరి ప్రొఫెషనల్ లో వాళ్ళు బాగానే సంపాదిస్తున్నామని అన్నారు.
ఆ సినిమా చేసి సర్వం కోల్పోయాం..
ధనరాజ్ మెడియన్ గానే కాదు డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమా లోనుంచి ధనరాజు కమెడియన్ గానే కాదు డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలను చేశారు. ప్రొడ్యూసర్ గా ధనలక్ష్మీ తలుపు తడితే అనే సినిమా తీశాడు. ఆ మూవీ చేయొద్దని ఎంత చెప్పినా వినలేదు. ఎందుకంటే అది గనక పోతే సర్వం కోల్పోతాం అని తెలుసు. నేను అనుకున్నట్టే ఆ మూవీ వల్ల అన్నీ కోల్పోయాం. మళ్లీ జీరోకు వచ్చేశాం. అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాం. ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాం. మా ఇద్దరి నడుమ గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ విడిపోలేదు. మీడియాలో మాత్రం విడిపోయాం అన్నట్టు వార్తలు వస్తుంటాయి. అవి మేం పట్టించుకోకుండా ప్రయాణం సాగిస్తున్నాం.. ప్రస్తుతం ధనరాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది.. త్వరలోనే ఓ స్టార్ హీరోతో డైరెక్టర్ గా మూవీ చేయబోతున్నట్లు చెప్పింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.