OTT Movie : హాలీవుడ్ సినిమాలను మన ప్రేక్షకులు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు, భారీ ఎత్తున కలెక్షన్స్ సాధిస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమాలను ఎక్కువగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. క్రైం థ్రిల్లర్ మూవీలా కాకుండా, ఒక ఫ్యామిలీ స్టోరీని చూసినట్టు ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాలు లోకి వెళ్తే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది ప్లేస్ బియాండ్ ది పైన్స్‘ (The place beyond the paines). ఈ ఎపిక్ క్రైమ్ డ్రామా మూవీకి డెరెక్ సియాన్‌ఫ్రాన్స్ దర్శకత్వం వహించారు. హీరో ఒక మోటారుసైకిల్ స్టంట్ రైడర్ కావడంతో, దొంగతనాలు చేసి తన కుటుంబాన్ని ఆదుకుంటాడు. బెన్ మెండెల్‌సోన్, రోజ్ బైర్నే, మహర్షలా అలీ, బ్రూస్ గ్రీన్‌వుడ్, హారిస్ యులిన్, రే లియోట్టా ఇందులో నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరో సర్కస్లో బైక్ రైడర్ గా పనిచేస్తుంటాడు. అతడు పనిచేస్తున్న ప్లేస్ కి రొమినా అనే మహిళ వస్తుంది. ఆమెను చూడగానే హీరో తన దగ్గరికి వస్తాడు. ఇదివరకే తనతో రిలేషన్ లో హీరో ఉండేవాడు. సర్కస్ చేస్తూ బయట ఎక్కువగా తిరుగుతుండటంతో ఆమెను మర్చిపోతాడు. అయితే మరుసటి రోజు రొమినా ఇంటికి హీరో వెళ్తాడు. అక్కడ ఒక చిన్న బాబు ఉంటాడు. అతడు తనకు పుట్టిన బిడ్డ అని తెలుసుకొని చాలా ఎమోషన్ అవుతాడు. ఈ విషయం తనకు ఎందుకు చప్పలేదని బాధపడతాడు. అయితే రోమీనా మరో వ్యక్తితో రిలేషన్ లో ఉంటుంది. హీరో రొమినాని తనతో ఉండమని బతిమాలుతాడు. మా ఇద్దరిని ఎలా పోషిస్తావంటూ ఆమె తగేసి చెప్తుంది. అందుకు హీరో దొంగతనాలు చేయడం మొదలు పెడతాడు. అందులో కొంత రుమినాకి ఇస్తూ, పిల్లవాడిని మంచిగా చూసుకోమని చెప్తాడు.
ఒకరోజు హీరో దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోతాడు. పోలీస్, హీరోని బెదిరించే క్రమంలో షూట్ చేస్తాడు. హీరోకి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే చనిపోతాడు. పోలీస్ ఆఫీసర్ అనవసరంగా ఒక వ్యక్తిని చంపానని బాధపడుతూ ఉంటాడు. తనకి ఒక కొడుకు ఉన్నాడని తెలిసి మరింతగా బాధపడతాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి పోలీస్ ఆఫీసర్ కొడుకు, హీరో కొడుకు ఫ్రెండ్స్ అవుతారు. అయితే గతంలో జరిగిన విషయాలు వీళ్లకు ఏమీ తెలిసి ఉండవు. అలా ఒక రోజు తన తండ్రిని చంపింది ఫ్రెండ్ తండ్రి అని తెలుసుకుంటాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక గన్ తీసుకుంటాడు. వాళ్ల మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు హీరో కొడుకు. తన తండ్రి చావుకు కారణమైన పోలీస్ పై హీరో కొడుకు పగ తీర్చుకుంటాడా? హీరో కొడుకు చివరికి ఏమవుతాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ది ప్లేస్ బియాండ్ ది పైన్స్’ అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.