Shruti Haasan: కమల్ హాసన్ భారతీయ సినిమాకే ఓ విశ్వవిద్యాలయం. నటన, దర్శకత్వం, రచన, నిర్మాణం – ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేశారు. అలాంటి మల్టీ టాలెంటెడ్ వ్యక్తి కుమార్తెగా శృతిహాసన్ తనకూ తండ్రిలాగే ఎన్నో రంగాల్లో ప్రతిభను చాటింది. సంగీతం, సినిమాలు, వెబ్ సిరీస్‌ల ద్వారా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. సినీనటి, గాయని, సంగీత దర్శకురాలు శృతిహాసన్ తన తండ్రి, విశ్వనటుడు కమల్ హాసన్‌పై ప్రేమగా, భావోద్వేగంతో ఓ హృదయాన్ని తాకే పోస్ట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఇలా..
శృతి హసన్ తండ్రితో కలిసి ఉన్న ఒక అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ఆమె ఇలా రాసింది:
“Always my source of light and strength and constant source of laughter 🙂 love you the most appa”
ఈ చిన్న వాఖ్యాల్లోనే ఆమె తన తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమను, గౌరవాన్ని, ఆప్యాయతను కచ్చితంగా తెలిపింది. తన జీవితంలో వెలుగునిచ్చే వ్యక్తిగా, సంక్షోభ కాలాల్లో బలాన్నిచ్చే శక్తిగా, ప్రతి రోజూ నవ్వులు పంచే ప్రియమైన వ్యక్తిగా తండ్రిని పేర్కొంది. ఇది కేవలం ఓ క్యాప్షన్ మాత్రమే కాదు.. తండ్రి–కూతురు బంధానికి ప్రతీకగా నిలిచే మాటలు.
వైరల్ అయిన ఫోటో – అభిమానుల స్పందన అమోఘం
శృతిహాసన్ పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అభిమానులు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు కామెంట్లు చేస్తూ హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు. కమల్ హాసన్, శృతిహాసన్ బంధం ఎప్పుడూ ప్రత్యేకమైనది మరోసారి శృతి గుర్తు చేసింది. వీరిద్దరూ కలిసున్న ఫోటోలో కనిపిస్తున్న అనుబంధం, ప్రేమ, గౌరవం అభిమానుల మనసులను హత్తుకుపోయింది.
తండ్రి – కూతురు బంధం – సినీ ప్రపంచానికే ఓ ప్రేరణ
శృతి తన తండ్రి పెంపకం పై చెప్పడం ఇదే మొదటి సారి కాదు. ఆయన మీద తనకి ఉన్న ప్రేమని శృతి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు: “నాకు ఏ విషయంలోనైనా ఇన్‌స్పిరేషన్ అంటే అది నా అప్పా. ఆయన నుండి నేర్చుకున్న బలమైన పాఠాలు జీవితంలో ముందుకెళ్లే మార్గాన్ని చూపించాయి.”
ఈ సందర్భం కేవలం కమల్ హాసన్ .. శృతి హాసన్ ల మధ్య బంధానికే పరిమితమైనదేం కాదు. ఇది ప్రతి తండ్రి – కూతురు మధ్య ఉండే ప్రేమను, గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఎంత బిజీ లైఫ్‌స్టైల్ ఉన్నా కుటుంబానికి, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం ఎలా ఉండాలో శృతిహాసన్ తన జీవితంలో చూపిస్తుంది.
ఈ పోస్ట్ ద్వారా శృతి అందరికీ గుర్తుచేసింది.. మన జీవితాల్లో బలమైన మద్దతుగా ఉండే వ్యక్తులు అంటే తల్లిదండ్రులే. వారు ఉన్నప్పుడే మనకు ఎలాంటి భయం లేదు. వారు ఇచ్చే ఆశీర్వాదం, ప్రేమ, మార్గదర్శకత జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుతుంది. తమ అభిమాన నటి, తండ్రి గౌరవాన్ని ఎంత అందంగా చాటిందో చూసి వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదే ప్రేమ, ఇదే అనుబంధం నేటి తరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.