E-Paper
Advertisement

మూడేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ… ఇప్పుడు మరో పేరుతో… సీను సీనుకో ట్విస్ట్

మూడేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ… ఇప్పుడు మరో పేరుతో… సీను సీనుకో ట్విస్ట్
Advertisement

The Secret Woman OTT : మూడేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ మహిళ… ఇప్పుడు మరో పేరుతో, మరో జీవితంతో ప్రశాంతంగా బతుకుతుంటే… ఒక్కసారిగా ఓ వ్యక్తి వచ్చి “నువ్వు అనుకుంటున్న వ్యక్తివి నువ్వు కాదు” అని చెబితే ? అప్పటి వరకు తన జీవితంగా భావించిన ప్రతిదీ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారితే ? తనకే తెలియని గతాన్ని వెతుక్కుంటూ వెళ్లిన ఓ మహిళకు అడుగడుగునా షాకింగ్ నిజాలు ఎదురయ్యే మిస్టరీ థ్రిల్లర్ ‘ది సీక్రెట్ ఉమెన్’ (The Secret Woman). మరి అసలు ఆమె ఎవరు ? ఎందుకు అదృశ్యమైంది ? తన గతాన్ని ఎందుకు మర్చిపోయింది ? అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో సాగే ఈ డానిష్ థ్రిల్లర్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే… 

లూయిస్ అనే మహిళ నార్వేలో తనకంటూ ఓ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటుంది. ఆమెకు తన గతం గురించి పెద్దగా జ్ఞాపకాలు ఉండవు. అయితే ఓ రోజు ఓ అపరిచితుడు ఆమె దగ్గరకు వచ్చి, ఆమె అసలు పేరు లూయిస్ కాదని, హెలెన్ అని చెబుతాడు. అంతేకాదు, మూడేళ్ల క్రితం డెన్మార్క్‌ లో అదృశ్యమైన మహిళ కూడా నువ్వేనని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక్కడి నుంచే అసలు మిస్టరీ మొదలవుతుంది. తాను ఎవరు ? తనకు గతంలో ఎలాంటి జీవితం ఉంది ? ఎందుకు కనిపించకుండా పోయింది ? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ లూయిస్ తన గతంలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ ఆమెకు మరో పెద్ద షాక్ ఎదురవుతుంది. తనకు గతంలో భర్త ఉన్నాడు, ఓ కొడుకు ఉన్నాడు, అంతేకాదు భారీ షిప్పింగ్ వ్యాపారంతో సంబంధం ఉన్న సంపన్న కుటుంబం కూడా ఉందని తెలుస్తుంది.

Advertisement

కానీ ఇంతటి కుటుంబం ఉన్న మహిళ అసలు ఎందుకు అదృశ్యమైంది ? ఆమె గతంలో ఏం జరిగింది ? తనకు తెలియని ఈ జీవితాన్ని ఎవరు దాచారు ? ఆమెను మరో పేరుతో కొత్త జీవితంలోకి ఎందుకు పంపించారు ? అనే ప్రశ్నలతో, గతాన్ని తెలుసుకునే కొద్దీ లూయిస్ చుట్టూ ఉన్న వ్యక్తులపై కూడా అనుమానాలు పెరుగుతాయి. చివరికి తన అసలు గుర్తింపు మాత్రమే కాదు, తన కుటుంబం వెనుక దాగి ఉన్న రహస్యాలు కూడా బయటపడటం మొదలవుతుంది. తాను నమ్మిన వాళ్లలో ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు ఏదో దాచిపెడుతున్నారు? అనే విషయం చివరి వరకు క్యూరియాసిటీని పెంచుతుంది.

Also Read : టీనేజ్ గర్ల్స్ సీక్రెట్ మిషన్లు… కొత్త విలన్‌తో హై-వోల్టేజ్ యాక్షన్… పాపులర్ స్పై యానిమేషన్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

బార్బరా టాప్సో-రోథెన్‌బర్గ్ దర్శకత్వం వహించిన ఈ డానిష్ మిస్టరీ థ్రిల్లర్‌లో నటాలీ మడ్యూనో, క్లాస్ బాంగ్, పాల్ స్వెర్రే హాగెన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కుటుంబ రహస్యాలు, అదృశ్యం, గుర్తింపు మిస్టరీ, క్రైమ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. డానిష్ భాషలో ఉన్న ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి సీను సీనుకో కొత్త ప్రశ్నను లేవనెత్తే ‘ది సీక్రెట్ ఉమెన్’ మంచి ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాను డోంట్ మిస్.

Tags

Related News

అంగీకారం లేకుండా ఆ పని… ప్రియురాలి కంప్లైంట్ తో రాత్రికి రాత్రే హీరో అరెస్ట్… ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

విలన్ ను అల్లాడించే ఆల్ఫా అమ్మాయిలు… ఓటీటీలోకి అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్

ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన డైరెక్టర్ కేకే ఆఖరి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

రాత్రికి రాత్రే స్టార్‌డమ్… ఫుట్‌బాల్ లెజెండ్ విన్స్ యంగ్ జీవితం ఎలా నాశనం అయ్యిందో కళ్ళకు కట్టిన సినిమా

కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే మరి… వైరల్ వీడియో కోసం వెళ్ళి 1500 ఏళ్ల దుష్టశక్తిని నిద్ర లేపారు

పెళ్లయినా తీరని కోరికలు… ఓటీటీలోకి బోల్డ్ ఇంటెన్స్ విమెన్ సెంట్రిక్ ఆంథాలజీ సిరీస్

టీనేజ్ గర్ల్స్ సీక్రెట్ మిషన్లు… కొత్త విలన్‌తో హై-వోల్టేజ్ యాక్షన్… పాపులర్ స్పై యానిమేషన్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×