BigTV English

Thammudu Movie : క్రెడిట్ కోసం కొట్టుకున్న హీరోయిన్లు.. క్లారిటీ రావాలంటే ట్రైలర్ చూడాల్సిందే!

Thammudu Movie : క్రెడిట్ కోసం కొట్టుకున్న హీరోయిన్లు.. క్లారిటీ రావాలంటే ట్రైలర్ చూడాల్సిందే!

Thammudu Movie : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ఇటీవల కాలంలో నితిన్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం తన సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నారు. ఇటీవల ఈయన నటి శ్రీ లీలతో కలిసి రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)నటించినప్పటికీ కూడా ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను ఆకట్టుకోలేకపోయింది.


పవన్ పేరు నిలబెట్టేనా…

ఇలా నితిన్ నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈయన మాత్రం వరస సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే నితిన్ తమ్ముడు(Thammudu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించగానే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. అయితే అదే టైటిల్ తో నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.


పవన్ సినిమా టైటిల్..

ఇక ఈ సినిమాలో సీనియర్ నటి లయ(Laya) కూడా కీలకపాత్రలో నటించారు. వర్ష బొల్లమ్మ , సప్తమి గౌడ,స్వసిక వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు మరియు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ సినిమా క్రెడిట్ కోసం గొడవ పడుతున్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది.

&nbsphttps://twitter.com/Theteluguone/status/1931999902114238916?t=V8DVTdbqWJw2syeL62Ac6w&s=19;

లయతో పాటు సప్తమి గౌడ స్వసిక అందరూ ఒకచోట కూర్చుని ఉండగా వర్ష అక్కడికి ఫోన్లో మాట్లాడుతూ వస్తుంటారు. ఆ రోజు నేను గట్టిగా అడగబట్టే జులై 4వ తేదీ ఈ సినిమా విడుదలవుతుంది అది మన క్రేజ్ అంటూ గొప్పగా చెబుతుంది. ఇకపోతే మనం అడిగితే వెంటనే ట్రైలర్ కూడా విడుదల చేస్తారని గొప్పలు చెబుతుంది. ఇంతలోనే మిగిలిన హీరోయిన్స్ కూడా నువ్వు చెప్పడం వల్ల రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఏంటి అంటూ ఈ సినిమా క్రెడిట్ కోసం నలుగురు గొడవ పడుతూ ఉంటారు.. అంతలోపు డైరెక్టర్ వేణు శ్రీరామ్ అక్కడికి వచ్చి అసలు ఏంటి మీ గోల? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మీ డౌట్స్ అన్ని క్లారిఫై కావాలి అంటే ట్రైలర్ చూడండి అంటూ సినిమాని విభిన్న రీతిలో ప్రమోట్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ టైటిల్ తో రాబోతున్న నితిన్ ఈ సినిమాతో హిట్ కొట్టి పవన్ కళ్యాణ్ పేరు నిలబెడతారా? లేదా తమ్ముడు సినిమా పేరును చెడగొడతారా? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×