OTT Movie : ఓటీటీలోకి ఎన్నో రకాల స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు బాగా మైండ్ లో గుర్తుండిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అటువంటిదే. చదువుకుంటూ మంచి స్తాయికి రావాలి అనుకున్న ఒక అమ్మాయి జీవితంలో అనుకోని మలుపులు తిరుగుతాయి. మెడికల్ స్టూడెంట్ అయిన ఆ అమ్మాయి రహస్యంగా సర్జరీలు చేస్తుంది. ఆతరువాత స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ బాడీ హారర్ మూవీ పేరు ‘అమెరికన్ మేరీ’ (American Mary). 2012 లో రిలీజ్ అయిన ఈ కెనడియన్ బాడీ హారర్ మూవీకి జెన్, సిల్వియా సోస్కా (సోస్కా సిస్టర్స్) దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాథరిన్ ఇసాబెల్ ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఒక మెడికల్ స్టూడెంట్ మేరీ మాసన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఆర్థిక సమస్యల కారణంగా రహస్యంగా బాడీ మాడిఫికేషన్ సర్జరీలను చేయాలని అనుకుంటుంది. ఆ తరువాత స్టోరీ మలుపులు తీసుకుంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
మేరీ మాసన్ ఒక ప్రతిభావంతమైన మెడికల్ స్టూడెంట్ గా ఉంటుంది. ఆమె సర్జన్ కావాలనే లక్ష్యంతో చదువులో కూడా ముందు ఉంటుంది. అయితే ఆర్థిక ఇబ్బందులు ఆమెను వెంటాడుతాయి. డబ్బు సంపాదించడానికి ఆమె ఒక స్ట్రిప్ క్లబ్‌లో ఉద్యోగం కోసం వెళ్తుంది. అక్కడ ఆమెకు క్లబ్ యజమాని బిల్లీ, ఒక గాయపడిన వ్యక్తిపై అత్యవసర సర్జరీ చేయమని చెప్తాడు. అలా చేస్తే $5,000 డాలర్లు ఇస్తానని ఆఫర్ చేస్తాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. కానీ ఈ చట్టవిరుద్ధమైన పని చేయడానికి ఆమె కాస్త భయపెడుతుంది. ఆ తర్వాత బీట్రెస్ అనే స్ట్రిప్పర్ మేరీని కలుసుకుంటుంది. బీట్రెస్ తన స్నేహితురాలు రూబీ కోసం ఒక అసాధారణ బాడీ మాడిఫికేషన్ సర్జరీ చేయమని కోరుతుంది. రూబీ తనను తాను బార్బీ బొమ్మలా మార్చుకోవాలనుకుంటుంది. అంటే ఆమె చనుమొనలను తొలగించి, జననాంగాలను దాదాపు మూసివేయాలని చెప్తుంది. మేరీ ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఈ సర్జరీ ఆమె బాడీ మాడిఫికేషన్ కమ్యూనిటీలో పాపులర్ అవుతుంది.
ఇంతలో మేరీ తన మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ గ్రాంట్ చేత ఒక పార్టీలో అత్యాచారానికి గురవుతుంది. ఈ సంఘటన ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. ఆమె మెడికల్ స్కూల్‌ను వదిలేసి, ప్రతీకారం తీర్చుకోవడానికి బిల్లీ సహాయంతో గ్రాంట్‌ను కిడ్నాప్ చేస్తుంది. ఆమె అతనిపై చలా రకాల బాడీ మాడిఫికేషన్ సర్జరీలను చేస్తుంది. అతని చేతులు, కాళ్లను తొలగించి, అతన్ని ఒక స్టోరేజ్ లాకర్‌లో చైన్‌లతో వేలాడదీస్తుంది.మేరీ ‘బ్లడీ మేరీ’ గా బాడీ మాడిఫికేషన్ ప్రపంచంలో సంచలనంగా మారుతుంది. ఆమె ఇల్ ఈగల్ గా తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ గ్రాంట్ ఎక్కడ ఉన్నాడో గుర్తు పడతాడు. ఈ విషయం తెలుసుకొని మేరీ అతన్ని చంపేస్తుంది. చివరికి రూబీ భర్త ఆమెపై ప్రతీకారంతో దాడి చేస్తాడు. మేరీకి తీవ్ర రక్తస్రావం జరిగి చనిపోతుంది. ఇలా ఈ స్టోరీ ముగుస్తుంది.