OTT Movie : హాలీవుడ్ సినిమాలకి ఎప్పటి నుంచో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఈ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుంటారు. ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఈ సినిమాలను చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ అందుబాటులో ఉండటంతో, ఎక్కువగా ఈ సినిమాలను థియేటర్లకు వెళ్లకుండానే వీక్షిస్తున్నారు. ఓటిటి ప్లాట్ ఫామ్ నే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. అందానికి ప్రాధాన్యతను ఇచ్చే ఒక రాజును, పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి నానా తంటాలు పడుతుంది. ఆ తర్వాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే….
స్టోరీలోకి వెళితే
రెబెక్కా అనే మహిళను తన భర్త చనిపోవడంతో, తన కూతుర్లు ఎల్విరా, అల్మాతో కలసి స్వీడ్లాండియా రాజ్యంలోకి నివసించడానికి వెళ్తుంది. అక్కడ రెబెక్కా ఒక ధనవంతుడైన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అయితే అతను మరణించిన తర్వాత, అతని ఆస్తి తనకి దక్కదని తెలుస్తుంది. దీంతో రెబెక్కా తన కుమార్తె ఎల్విరాను ప్రిన్స్ జూలియన్ ను వివాహం చేసుకోమని ఒత్తిడి తెస్తుంది. ఎందుకంటే జూలియన్ కు రాజ్యంలో తన భార్యను ఎంచుకునే సమయం వస్తుంది. అయితే ఇప్పుడు ఎల్విరా తన అందానికి మెరుగులు దిద్దడం ప్రారంభిస్తుంది. ఆమె స్టెప్ సిస్టర్ అగ్నెస్ మాత్రం తనకన్నా అందంతో ఉంటుంది.
అందం ఒక వ్యాపారంగా ఉన్న ఈ రాజ్యంలో, ఎల్విరా ప్రిన్స్ జూలియన్ దృష్టిని ఆకర్షించడానికి తాను కూడా తీవ్రమైన శస్త్ర చికిత్సలను చేసుకుంటుంది. ఆమె కనురెప్పను మార్చడం, ముక్కు సర్జరీ, బరువు తగ్గడానికి, పెళ్లి సమయంలో షూలో సరిపోవడానికి తన కాలి వేళ్లను కూడా కత్తిరించుకుంటుంది. ఈ క్రమంలో ఆ రాజ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఈ స్వయంవరం హత్యలదాకా వెళ్తుంది. చివరికి ఎల్విరా జూలియన్ ను పెళ్లి చేసుకుంటుందా ? తన అందం చివరికి ఎలా మారుతుంది. ఆస్తి కోసమే ఇటువంటి మార్గాన్ని ఎంచుకుంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : కార్లో ఉన్నంత సేపూ పగలే, కారు దిగితే మాత్రం నైట్… హర్రర్ మూవీ లవర్స్ కు ఫుల్ కిక్కిచ్చే మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది అగ్లీ స్టెప్‌సిస్టర్’ (The Ugly Stepsister). 2025 లో వచ్చిన ఈ సినిమాకి ఎమిలీ బ్లిచ్‌ఫెల్డ్ దర్శకత్వం వహించారు. ఇందులో లీ మైరెన్, థియా సోఫీ లోచ్ నాస్, డాల్ టోర్ప్, ఫ్లో ఫాగెర్లీ వంటి నటులు నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.