BigTV English

BRS : కేసీఆర్ ఫ్యూచర్ ఏంటి? రిటర్న్ గిఫ్ట్ బెదుర్స్?

BRS : కేసీఆర్ ఫ్యూచర్ ఏంటి? రిటర్న్ గిఫ్ట్ బెదుర్స్?

BRS : రెండు కళ్ల సిద్దాంతం. ఈ స్టేట్‌మెంట్‌లో ఉద్యమ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును బాగా బ్లేమ్ చేసింది బీఆర్ఎస్. ఇప్పడదే రెండు కళ్ల సిద్దాంతం కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్‌గా రావడం కాకతాళీయం. ఆ బహుమతి కూతురు నుంచే రావడం మరింత ఆసక్తికరం. కవిత డైరెక్ట్‌గా చెప్పేశారు. కేసీఆర్‌పై ఈగను కూడా వాలనీయమని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే.. జాగృతి మరో కన్ను అని అన్నారు. అంటే, ఇకనుంచి బీఆర్ఎస్ వేరు, జాగృతి వేరు. కారు పార్టీ కేటీఆర్‌ది. జాగృతి కవితది. ఎనీ డౌట్స్?


కూతురు చెప్పిన సిద్ధాంతం..

కేసీఆర్‌కు వాట్ నెక్ట్స్? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. కొడుకును కాదనలేడు. కూతురును ఆపలేరు. ఇద్దరూ తగ్గేదేలే అంటుంటే మధ్యలో తండ్రిగా గులాబీ బాస్‌కు సౌండ్ లేకుండా పోతోంది. ఏ కన్నును పొడిచినా ఆయనకే బాధ. అత్యంత క్లిష్టమైన చిక్కుల్లో చిక్కుకుపోయారు కేసీఆర్. ఇకపై రెండు కళ్ల సిద్ధాంతం పాటించాల్సిందేనా?


రిటర్న్ గిఫ్ట్ తగులుతోందా?

ఒకప్పుడు కేసీఆర్ ఎత్తులు, జిత్తులకు చాలామంది రాజకీయంగా సమాధి అయ్యారని అంటారు. ఇప్పుడదే ఆయనకు రిటర్న్ గిఫ్ట్‌గా దెబ్బ కొడుతోందని అంటున్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన లీడర్‌కు.. కన్నింటి వాసాలు లెక్కిస్తున్న డాటర్.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి.. కొండా లక్ష్మణ్ బాపూజీని వాడుకొని వదిలేశారనే ఆరోపణ ఉంది. టైగర్‌గా పేరు గాంచిన ఆలె నరేంద్ర తన “తెలంగాణ సాధన సమితి” పార్టీని అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం చేసి కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కారు పార్టీలో నెంబర్ 2 గా ఉండేవారు. అలాంటి నరేంద్రను తొక్కిసి.. ఆయన పార్టీ వీడిపోయేలా కేసీఆర్ కుట్ర చేశారనే ఆరోపణ ఉంది.

చాణక్యుడి చాకచక్యానికి పరీక్ష?

విజయశాంతి సైతం తన ‘తల్లి తెలంగాణ’ పార్టీని కేసీఆర్‌ చేతిలో పెట్టి.. ఆయనకు రాఖీ కట్టి.. దేవుడిచ్చిన చెల్లిగా చలామణి అయ్యారు. అలాంటి విజయశాంతిని సైతం హర్ట్ చేసి, సైడ్ చేసి, పార్టీ నుంచి వెళ్లగొట్టారని కేసీఆర్‌ను విమర్శిస్తుంటారు. ఇక, గులాబీ జెండాకు ఓనర్లం మేమే అన్నందుకు ఈటల రాజేందర్‌ను ఎంత అవమానకర రీతిలో మెడపట్టి గెంటేశారో గుర్తు చేస్తున్నారు. ఇలా కేసీఆర్ హిస్టరీ షీట్‌లో అనేక వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని తెలంగాణవాదులు తరుచూ చెబుతుంటారు. అలాంటిది ఇప్పుడు సొంత ఇంటిలోనే సమస్య రావడంతో ఈ చాణక్యుడు ఎలా చాకచక్యంగా పరిష్కరిస్తారో మరి?

Also Read : కవిత భయపడ్డారా? భయపెట్టారా?

రక్త సంబంధమా? పార్టీ సిద్ధాంతమా?

కవిత చెప్పినట్టు రెండు కళ్ల సిద్ధాంతం కేసీఆర్‌కు వర్కవుట్ అవుతుందా? ఇప్పటికే బీఆర్ఎస్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తోంది. కేటీఆర్ వర్కింగ్ బాస్. మరిప్పుడు కొత్తగా కవితను కేసీఆర్ ఎంకరేజ్ చేస్తారా? జాగృతి జోరు పెరిగితే అది కారుకే డ్యామేజ్. కంట్రోల్ చేద్దామంటే కూతురు వినట్లే. తాను కేసీఆర్ కంటే ఖతర్నాక్ అంటోంది. అందుకే, కవిత విషయంలో కేసీఆర్ మూవ్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. రక్త సంబంధమా? పార్టీ సిద్ధాంతమా? కూతురా? కొడుకా?

Related News

Hyderabad Skywalk: హైదరాబాద్‌లో మరో రెండు స్కైవాక్ లు.. ఈ ఏరియాల్లో ప్రజల కష్టాలు తీరినట్లే!

CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్‌అండ్ టీ తప్పుకోలేదు.. ఇది కేసీఆర్ కుట్ర, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Fake doctors: హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్.. ఎలాంటి లైసెన్స్ లేకుండా వైద్యం.. చివరకు?

KTR Elevations: ఇదేం ఎలివేషన్ సామీ? ఓజీ సినిమాపై కేటీఆర్ కి అంత మోజుందా?

Weather News: రాష్ట్రంలో కుండపోత వర్షం.. ఈ ప్రాంతాల్లో రాత్రంతా కొట్టుడే కొట్టుడు, జాగ్రత్తగా ఉండండి

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువవైన గంజాయి పట్టివేత

Kalvakuntla Kavitha: నేను ఫ్రీ బర్డ్.. బీఆర్ఎస్ నేతలు నాతో టచ్‌లో ఉన్నారు.. త్వరలో బాంబు పేల్చనున్న కవిత?

Income Tax Raids: నాలుగో రోజు క్యాప్స్‌ గోల్డ్ కంపెనీలో ఐటీ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Big Stories

×