OTT Movie : హారర్ సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలను చూసి భయపడుతూ థ్రిల్ అవుతుంటారు మూవీ లవర్స్ . వీటిని ఎవరో ఒకరు తోడు ఉండగానే చూస్తుంటారు. లేకపోతే గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ మూవీ, భయంకరమైన సన్నివేశాలతో వణుకు పుట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
రెండు ఓటిటి లలో స్ట్రీమింగ్
ఈ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేర్ ‘ది వైలింగ్’ (The Wailing). 2016 లో వచ్చిన ఈ మూవీకి నా హాంగ్-జిన్ దర్శకత్వం వహించారు.ఇందులో క్వాక్ డో-వాన్, హ్వాంగ్ జంగ్-మిన్, చున్ వూ-హీ నటించారు. ఒక కొరియన్ గ్రామంలో హత్యలు, అనారోగ్యాల సమస్యలు ఎక్కువ అవుతాయి. తన కూతురిని రక్షించడం కోసం ఒక పోలీస్ తండ్రి ప్రయత్నిస్తాడు. ఈ మూవీ కమర్షియల్‌గానూ, విమర్శకులపరంగానూ విజయం సాధించింది. 2 గంటల 36 నిమిషాల నిడివి ఉండే ఈ మూవీ IMDb రేటింగ్ లో 7.4/10 ఉంది. నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
గోక్‌సియాంగ్ అనే పర్వత గ్రామంలో ఒక రోజు ఒక జపానీ వ్యక్తి వచ్చి స్థిరపడతాడు. అతని రాక తర్వాత గ్రామంలో వింతైన, భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఒక విచిత్రమైన వ్యాధి కూడా అక్కడ వ్యాపిస్తుంది. దీని వల్ల ప్రజలు మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తూ మనుషులను దారుణంగా చంపేస్తారు. ఈ ఘటనలకు కారణం ఆ జపానీ వ్యక్తి అని గ్రామస్తులు అనుమానిస్తారు. ఎందుకంటే అతని గురించి భయంకరమైన పుకార్లు వ్యాపిస్తాయి. ఇందులో జాంగ్-గూ ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. అతను ఈ హత్యలను దర్యాప్తు చేస్తుంటాడు. కానీ అతని కూతురు హ్యో-జిన్ కూడా ఈ వ్యాధి బారిన పడుతుంది. ఆమెకు ఏమైందో అని బట్టలు అంతా చెక్ చేసి చూస్తాడు. తన కూతురిని రక్షించడానికి జాంగ్-గూ అన్ని మార్గాలను ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను మూ-మ్యాంగ్ అనే ఒక మంత్రికురాలిని కలుస్తాడు. ఆమె ఆ జపానీ వ్యక్తి ఒక దెయ్యం అని చెబుతుంది.
అదే సమయంలో, జాంగ్-గూ ఒక షమన్ సహాయం తీసుకుంటాడు. అతను హ్యో-జిన్‌పై ఒక శక్తివంతమైన మంత్రాలతో బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత ఈ వ్యాధి ఒక సాధారణ ఇన్ఫెక్షన్ కాదని, దీని వెనుక దెయ్యాలు, ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ స్టోరీలో జపానీ వ్యక్తి, షమన్‌ల మధ్య ఎవరు నిజంగా మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది అస్పష్టంగా ఉంటుంది. సినిమా క్లైమాక్స్‌లో జాంగ్-గూ అతని కుటుంబం కోసం, ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. చివరకు ఆ గ్రామం లో ఉన్న భయంకరమైన సంఘటనలు, ఎవరి వల్ల జరుగుతున్నాయి అనేది ఈ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కూతుర్ని ప్రేమించాడాని ప్రైవేట్ పార్ట్ కట్ … ఉంపెడు గత్తెగా మారే ప్రియురాలు .. ఇదెక్కడి అరాచకంరా అయ్యా