Dinner Time: మీరు మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటే.. శరీరానికి అవసరమైన పోషకాలను ఎక్కువగా అందించే వాటిని మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పోషకాహారంతో పాటు, మీరు తినే సమయం కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
శరీరాన్ని ఆరోగ్యంగా, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడానికి, భోజనానికి ఒక సమయాన్ని నిర్ణయించుకుని, ప్రతిరోజూ ఒకే సమయంలో తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అంతే కాకుండా రాత్రి భోజనం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం కూడా అవసరం అంటారు.
మీరు తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి:
ఇటీవలి అధ్యయనంలో.. రాత్రిపూట ఆలస్యంగా తినేవారికి ఊబకాయం వచ్చే ప్రమాదంతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అదే విధంగా ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజంలో ప్రచురితమైన మరొక అధ్యయనం ప్రకారం.. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఆలస్యంగా భోజనం చేయడం, బరువు పెరగడం:
ఒక అధ్యయనంలో రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరిగే పరిస్థితులను తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. “ఆలస్యంగా తిన్న వ్యక్తుల్లో లెప్టిన్ , గ్రెలిన్ వంటి ఆకలిని నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపింది.
ముఖ్యంగా ఆలస్యంగా తిన్న వారిలో కడుపు నిండినట్లు సూచించే లెప్టిన్ అనే హార్మోన్ తగ్గింది. రాత్రి 11 గంటల తర్వాత తినేవారిలో కేలరీలు తక్కువ రేటుతో బర్న్ అవుతాయని, దీ నివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని తేలింది.
భోజన సమయాల్లో మార్పులు శరీరం యొక్క సిర్కాడియన్ లను ప్రభావితం చేస్తాయి. ఇది పలు సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
మరొక అధ్యయనంలో.. ఆలస్యంగా తినడం వల్ల బరువు , రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని రుజువైంది.
ఆలస్యంగా తినేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయని , కొవ్వు తక్కువగా కరుగుతుంది. మీరు మీ దినచర్యను సాధారణ సిర్కాడియన్ లయకు అనుగుణంగా నిర్వహించకపోతే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విధంగా శరీరం గ్లూకోజ్‌ను విడుదల చేయదు.
రాత్రి భోజనం ఆలస్యంగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తో పాటు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు 2-3 గంటలు భోజనం చేయడం వల్ల శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది.
రాత్రి భోజనానికి సరైన సమయం ఏది ?
చాలా మంది నిపుణులు , పరిశోధనల ప్రకారం.. నిద్రపోవడానికి కనీసం 2 నుండి 3 గంటల ముందు రాత్రి భోజనం తీసుకోవాలి. మీరు రాత్రి 10 గంటలకు నిద్రపోతే, రాత్రి 7 నుండి 8 గంటల మధ్య భోజనం చేయడం మంచిది. నిద్రపోవడానికి రెండు గంటల ముందు తినడం వల్ల శరీరానికి ఆహారం జీర్ణం కావడానికి సమయం లభిస్తుంది