OTT Movies : ఇటీవల ఓటీటీలో కొత్త సినిమాలతో పాటుగా పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అయితే హారర్ థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. విభిన్నమైన కంటెంట్‌తో ఓటీటీ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త కథా, కథనాలతో మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక్కో సినిమా ఒక్కో స్టోరీతో వస్తుంది. తాజాగా మరో మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హారర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు స్ట్రీమింగ్ కు రాబోతున్న మూవీ ఏంటి..? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..
మూవీ..
హారర్ థ్రిల్లర్ జోనర్‌కు ఫాంటసీ, కామెడీ, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్ వంటి వివిధ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎన్నో వైవిధ్యమైన సినిమాలను వచ్చాయి. ఎప్పుడు ఎక్కడా చూడని విధంగా ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ మూవీ పేరు ది విచ్ రివేంజ్.. ఓ మంత్రగత్తె పగ అని దీనర్థం. టైటిల్‌కు తగినట్లుగానే సినిమా కథ ఉంటుంది. అయితే, ఆ మంత్రగత్తె సాధారణమైన మనుషుల మీద కాకుండా ఏకంగా దేశానికి రక్షణగా ఉంటున్న సైనికులను టార్గెట్ చేస్తుంది.
ఓటీటీ..
ఆండ్రీ కొలెస్నిక్ దర్శకత్వం వహించారు. అయితే, ది విచ్ రివేంజ్ ఉక్రేయిన్ భాషలో తెరకెక్కింది. దీనికి ఐఎమ్‌డీబీ నుంచి పదికి 5.3 రేటింగ్ మాత్రమే వచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది. జియో హాట్‌స్టార్‌లో కేవలం హిందీ భాషలో ది విచ్ రివేంజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మరో ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఏకంగా నాలుగు భాషల్లో ది విచ్ రివేంజ్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్, హిందీ, తమిళంతోపాటు తెలుగు లో కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది.
Also Read : తినడానికి తిండి లేదు.. ఒక్కపూట కోసం ఎన్ని కష్టాలో.. ఉద్యోగం కోసం వెళ్తే దారుణం..
స్టోరీ విషయానికొస్తే..
2022 ఫిబ్రవరిలో ఉక్రేయిన్‌పై రష్యా దాడి చేస్తుంది. మరోవైపు కోనోటాప్‌కు చెందిన ఒలెనా, ఆండ్రీ ఇద్దరు లవర్స్ రొమాంటిక్‌గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. పెళ్లి చేసుకుందామనుకుంటారు.. ఆమె మంత్రగత్తెగా మారింది. ఉక్రేయిన్ సైనికులను ఒక్కొక్కరిని మట్టుబెడుతుంది.. బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి ఓ వింత దెయ్యం తో ఒళ్లు గగుర్పొడిచేలా చంపిస్తుంది. మరి మంత్రగత్తె ఒలెనాను ఆర్మీ ఎలా ఎదుర్కొంది తన నుంచి సైనికులు ప్రాణాల తో బయటపడ్డారా? అసలు ఈ సైనికులపై ఆ మంత్రగత్తె ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాది అనేది సినిమా స్టోరీ లోనే చూడాలి.. అసలు ఈమెకు ఆ సోల్జర్స్ కి ఎందుకు అంత పగ.. ఆమెకు సంబంధించిన వాళ్లను సోల్జర్స్ ఏమైనా చంపేశారా? అందుకే ఆమె మంత్రగత్తగా మారిందా? ఏంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూసేయాల్సిందే.