పాకిస్తాన్ ని టార్గెట్ చేస్తూ భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రెండు విషయాల్లో ఆయన పాక్ ని దుయ్యబట్టారు. అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్న పాకిస్తాన్ పై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(IAEA) పర్యవేక్షణ ఉండాలన్నారు. అదే సమయంలో పాకిస్తాన్, నిధులకోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)కి దరఖాస్తు చేసుకోడంపై కూడా ఆయన సెటైర్లు పేల్చారు.
https://twitter.com/ANI/status/1922911550534234424?
బ్లాక్ మెయిల్స్ సహించం..
పహల్గాం దాడి తర్వాత భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలిసారి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. బాదామి బాగ్ కంటోన్మెంట్ లో ఆయన జవాన్లతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో వారు చూపిన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అదే సమయంలో పాకిస్తాన్ పై ఆయన విమర్శల వర్షం కురిపించారు. అణ్వాయుధాల పేరు చెప్పి భారత్ ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు రాజ్ నాథ్ సింగ్. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఉటంకించారు. పాక్ లోని అణ్వాయుధాలను అంతర్జాతీయ సంస్థల పర్యవేక్షణలో ఉంచాలని డిమాండ్ చేశారు. సరిహద్దు ఉగ్రవాదం పట్ల భారతదేశం ఇక ఎంతమాత్రం సహనంతో ఉండదని హెచ్చరించారు. బాధ్యతారహితమైన, మోసపూరితమైన దేశం చేతుల్లో అణ్వాయుధాలు ఉండకూడదని అన్నారు రాజ్ నాథ్ సింగ్. పాకిస్తాన్ అణ్వాయుధాలను IAEA (అంతర్జాతీయ అణుశక్తి సంస్థ) పర్యవేక్షణలోకి తీసుకోవాలన్నారు.
#WATCH | Srinagar, J&K: Defence Minister Rajnath Singh says, "…I ask the entire world if nuclear weapons are safe in the hands of such an irresponsible and rogue nation. I believe that Pakistan's nuclear weapons should be taken under the supervision of International Atomic… pic.twitter.com/7tQA7mbZZI
— ANI (@ANI) May 15, 2025
ఆపరేషన్ సిందూర్ ను భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక సైనిక చర్యగా అభివర్ణించారు రాజ్ నాథ్ సింగ్. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారతదేశం ఏ స్థాయికైనా వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. గత 40 ఏళ్లుగా భారత్ సరిహద్దు అవతలనుంచి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని చెప్పారాయన. పహల్గాంలో దాడులు చేసిన ఉగ్రవాదులు.. భారతదేశం యొక్క నుదిటిపై గాయం చేశారని, దేశ సామాజిక ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని అన్నారు. వారు భారతదేశ నుదిటిపై గాయం చేస్తే, తాము వారి గుండెలపై గాయం చేశామన్నారు. ఈ గాయాలు కాకూడదు అనుకుంటే.. పాకిస్తాన్ భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వకూడదన్నారు రాజ్ నాథ్ సింగ్.
ఉగ్రవాదం, చర్చలు రెండూ కలసి సాగవు అని అన్నారు రాజ్ నాథ్ సింగ్. ఓవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, మరోవైపు చర్చలకు రావడాన్ని తాము ఒప్పుకోబోమన్నారు. పాకిస్తాన్, భారత్ ని పదే పదే మోసం చేస్తోందని, ఉగ్రవాదులకు మద్దతివ్వబోమని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేసిందని అన్నారు. ఇలాంటి నమ్మక ద్రోహానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకుందని, ఇకపై ఆ ద్రోహం ఆపకపోతే మరింత పెద్దమొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు రాజ్ నాథ్ సింగ్.
భారత్ పై ఉగ్రవాదుల దాడి జరిగితే కచ్చితంగా అది యుద్ధ చర్యగా పరిగణిస్తామని, ఎదురుదాడి బలంగా ఉంటుందని హెచ్చరించారు రాజ్ నాథ్ సింగ్. సరిహద్దు దాటి ఎటువంటి అనవసరమైన చర్యలు తీసుకోకూడదని ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని, అది మీరితే.. విషయం చాలా దూరం వెళ్తుందని అన్నారు.
బిచ్చగాళ్లు..
ఇక పాకిస్తాన్ ని బిచ్చగాళ్ల దేశం అంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. పాకిస్తాన్ ఎక్కడ నిలబడితే, అక్కడినుంచే బిచ్చగాళ్ల వరుస మొదలవుతుందన్నారాయన. ఆర్థిక సాయం కోసం ఆ దేశం పదే పదే అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)కి విజ్ఞప్తి చేయడంపై ఆయన సెటైర్లు పేల్చారు. పేద దేశాలకు సాయం చేసేందుకు IMFకు రుణాలు ఇచ్చే దేశాల జాబితాలో భారత్ ఉంటే.. IMF నుంచి సాయం కోరే దేశాల్లో పాకిస్తాన్ ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్.