OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే యాక్షన్ అడ్వెంచర్, ఫాంటసీ సినిమాలకు మన ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలకు అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తోడేలు, సింహం చుట్టూ తిరుగుతుంది. పిల్లలతో కలసి ఈ మూవీ ని చూస్తే మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ది వోల్ఫ్ అండ్ ది లయన్’ (The wolf and the lion). 2021 లో వచ్చిన ఈ మూవీకి గిల్లెస్ డి మైస్ట్రే దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోలీ కుంజ్ హీరోయిన్ పాత్రలో నటించారు. ఆమె తన తాతకి చెందిన దీవికి తిరిగి వచ్చి ఒక తోడేలు, సింహం పిల్లను చూసుకుంటుంది. వీటిని కొంతమంది హీరోయిన్ కి తెలీకుండా తీసుకెళ్లిపోతారు. వాటిని వెతికే క్రమంలో స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ 25 సెప్టెంబర్ 2021న జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అక్కడ ఇది ఉత్తమ పిల్లల చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఇది 13 అక్టోబర్ 2021న విస్తృతంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక ఐలాండ్ కి వస్తుంది. ఆ ఐలాండ్ వీళ్ళ సొంతదే కాబట్టి, చూడటానికి అప్పుడప్పుడు వెళుతుంది. అయితే ఆ ప్రాంతంలో ఒక తెల్ల తోడేలు ఉంటుందని, దానితో స్నేహం చేయమని హీరోయిన్ గ్రాండ్ ఫాదర్ చెప్తాడు. అక్కడికి వెళ్లిన హీరోయిన్ ఆ తోడేలు తో స్నేహం చేస్తుంది. ఆ తర్వాత అదే ప్రాంతంలో విమాన ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి ఒక సింహం పిల్ల బయటపడుతుంది. ఆ సింహం పిల్ల హీరోయిన్ కంటికి కనబడుతుంది. ఈ రెండిటిని హీరోయిన్ తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. అయితే కొద్ది రోజులకి తోడేలు, సింహం కాస్త పెద్దగా తయారవుతాయి. అవి చాలా ప్రమాదకరమైనవని, వాటిని జూ సిబ్బందికి అప్పజెప్పమని ఆమె అంకుల్ చెప్తాడు. అయితే ఆమె ఆ మాటలను పట్టించుకోకుండా వాటిని పెంచుతుంది.
ఒకరోజు ఆ దీవికి ఒక ఫ్యామిలీ వస్తుంది. ఆ ఫ్యామిలీని వీటికి దూరంగా ఉండమని చెప్పడానికి వెళుతుండగా కాలుజారి కింద పడుతుంది. అలా పడటంతో హీరోయిన్ స్పృహ కోల్పోతుంది. ఇది చూసిన అంకుల్ వాటిని సర్కస్ సిబ్బందికి అప్పజెప్తాడు. హాస్పిటల్లో మెలకువలోకి వచ్చిన హీరోయిన్ వాటి గురించి తెలుసుకొని బాధపడుతుంది. చాలాచోట్ల అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి ఆ జంతువులను హీరోయిన్ కనిపెడుతుందా? వాటిని మళ్లీ తన దగ్గరే పెంచుకుంటుందా? వాటి వల్ల ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది వోల్ఫ్ అండ్ ది లయన్’ (The wolf and the lion) అనే ఈ మూవీని చూడండి.