Mrunal Thakur:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ (Mrunal thakur) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘సీతారామం’ సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలలో చిర స్థానాన్ని సంపాదించుకున్న ఈ అమ్మడు.. చివరిగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం అడివి శేష్ (Adivi Shesh) తో కలిసి ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తోంది. వాస్తవానికి ఈ పాత్రలో గతంలో శృతిహాసన్ (Shruti Hassan) నటించింది. కానీ చిత్ర బృందంతో విభేదాలు రావడంతో ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ స్థానాన్ని మృణాల్ ఠాకూర్ భర్తీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో భాగమైనట్టు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత నుంచి డెకాయిట్ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు
ఇక అభిమానుల ఎదురుచూపుకు తెరదింపుతూ ఆడియన్స్ కి మృణాల్ ఠాగూర్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. పేపర్ వెయిట్ ను చేత్తో గుండ్రంగా తిప్పుతూ.. తాను డెకాయిట్ షూట్ లో పాల్గొంటున్న విషయాన్ని చెప్పి సంతోషపరిచింది. ఇప్పటి వరకూ రొమాంటిక్ , ఫ్యామిలీ డ్రామా సినిమాలలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఈ డెకాయిట్ సినిమాలో తన క్యారెక్టర్ కు పూర్తి భిన్నంగా కనిపించనున్నట్లు సమాచారం.అంతేకాదు మృణాల్ ఠాకూర్ నటిస్తున్న మొదటి థ్రిల్లర్ యాక్షన్ మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. మరి మునుపెన్నడూ చేయని పాత్రలో మృణాల్ ఎలా తనను తాను.. పాత్రకు తగ్గట్టుగా మలుచుకొని ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. డెకాయిట్ సినిమా విషయానికి వస్తే.. అడివి శేషు హీరోగా మృణాల్ హీరోయిన్ గా రాబోతున్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తూ ఉండడం గమనార్హం
మృణాల్ ఠాకూర్ కెరియర్..
ఇక 1992 ఆగస్టు ఒకటిన మహారాష్ట్ర ధులేలో జన్మించిన ఈమె.. మొదట సీరియల్స్ ద్వారానే కెరియర్ ను ప్రారంభించింది. 2012లో ముజ్సే కుచ్ కెహెతి , ఏ ఖామోషియాన్ వంటి హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టి, 2014లో విట్టి దండు అనే మరాఠీ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఇప్పుడు డెకాయిట్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అలా మరాఠీ, హిందీ, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మృనాల్ చేతిలో మరో హిందీ ప్రాజెక్టు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇందులో కూడా భాగం అయింది. మరి ఈ అమ్మడు కి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Posani Arrest : తగిన శాస్తి జరిగింది… పోసాని అరెస్టుపై నటుడి కామెంట్స్ వైరల్..!
.