Afghanistan Team: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ – బి లో బుధవారం ఇంగ్లాండ్ – ఆఫ్గనిస్తాన్ జెట్ల మధ్య పోటీ జరిగింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. మంగళవారం ఆస్ట్రేలియా – సౌత్ ఆఫ్రికా మధ్య వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో.. ఇంగ్లాండ్ – ఆఫ్గనిస్తాన్ జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్స్ కి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును బోల్తా కొట్టించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇంగ్లాండ్ పై తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో 8 పరుగుల తేడాతో గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 146 బంతులలో 12 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 177 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో రెహ్మానుల్లా గుర్బాజ్ {6}, సెదికుల్లా అటల్ {4}, రహ్మత్ షా {4}.. పరుగులతో విఫలం చెందగా.. హస్మతుల్లా షాహిదీ {40}, అజ్మతుల్లా ఒమర్జాయ్ {41}, మహమ్మద్ నబీ {40} పరుగులతో రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ 325 పరుగుల భారీ స్కోర్ ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, లివింగ్ స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీ తో అలరించిన జద్రాన్.. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ {177} నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
అనంతరం లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇంగ్లాండ్ జట్టులో జో రూట్ {120} సెంచరీ చేసినా ఫలితం దక్కలేదు. ఈ టోర్నీలో వరుసగా రెండు ఓటములతో ఇంగ్లాండ్ టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇక ఆఫ్గనిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో తన తొలి మ్యాచ్ లోనే ఓటమిని చవిచూసింది. టోర్నీ ప్రారంభానికి ముందు ఛాంపియన్స్ గానే ఇక్కడి నుండి వెళతామని చెప్పిన ఆఫ్ఘనిస్తాన్.. తొలి మ్యాచ్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
ఆ తర్వాత జరిగిన రెండవ మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని సెమీఫైనల్స్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఐసీసీ టోర్నీలలో ఆఫ్గనిస్తాన్ నమోదు చేసిన సంచలన విజయాలకు సంబంధించిన రికార్డులు వైరల్ గా మారాయి. ఇలా గతంలో కూడా అనూహ్యంగా ఘన విజయాలను సాధించింది ఆఫ్గనిస్తాన్ జట్టు. 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కి షాక్ ఇచ్చి.. పాకిస్తాన్, శ్రీలంకను సైతం ఓడించింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియాను సైతం దాదాపు ఓడించినంత పని చేసింది. ఇక 2024 టీ-20 ప్రపంచ కప్ లో కూడా సెన్సేషన్ ఫామ్ ని కొనసాగించి సెమీస్ చేరింది. 2024 టీ-20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లపై ఘన విజయం సాధించి సేమిస్ చేరింది. ఇక ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ జట్టుపై సంచలన విజయాన్ని నమోదు చేసి సెమీస్ చేరుకుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు.
🏏𝐓𝐡𝐞 𝐫𝐢𝐬𝐞 𝐨𝐟 𝐀𝐟𝐠𝐡𝐚𝐧𝐢𝐬𝐭𝐚𝐧 𝐜𝐫𝐢𝐜𝐤𝐞𝐭 🇦🇫
No more upsets – they're punching above their weight in every tournament since 2023. pic.twitter.com/y2ehd15CPL
— CricTracker (@Cricketracker) February 26, 2025