E-Paper
Advertisement

చుట్టూ శత్రువులు.. తప్పించుకునే దారే లేదు… ఉగ్రవాదులకు ఒంటరిగానే చుక్కలు చూపించిన ప్రెసిడెంట్…

చుట్టూ శత్రువులు.. తప్పించుకునే దారే లేదు… ఉగ్రవాదులకు ఒంటరిగానే చుక్కలు చూపించిన ప్రెసిడెంట్…
Advertisement

Hollywood Action Thriller: అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కారు గురించి వినే ఉంటారు. దాని పేరు ‘ది బీస్ట్’. బుల్లెట్లు, బాంబు దాడులను సైతం తట్టుకునే ఈ హైటెక్ వాహనంలో అత్యాధునిక రక్షణ వ్యవస్థలతో పాటు రహస్య ఆయుధాలు కూడా ఉంటాయి. అలాంటి కారే ఒకరోజు అమెరికా అధ్యక్షుడికి కవచంగా మారితే? పైగా శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికి అధ్యక్షుడే ఆ కారును నడుపుతూ ఎదురుదాడికి దిగాల్సి వస్తే? ఈ ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బీస్ట్’ (The Beast – 2026). రెన్నీ హార్లిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శామ్యూల్ ఎల్. జాక్సన్, జోయెల్ కిన్నమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్ కి కూడా అందుబాటులోకి వచ్చింది.

కథలోకి వెళ్తే…

అమెరికా అధ్యక్షుడు ఆస్కార్ పల్లాడిన్ (శామ్యూల్ ఎల్. జాక్సన్) ఒక అధికారిక పర్యటనలో ఉండగా, గుర్తుతెలియని సాయుధ ముఠా భారీ దాడికి దిగుతుంది. ఇది సాధారణ ఉగ్రవాద దాడి కాదు.. అమెరికా ప్రభుత్వాన్ని కూలదోసే లక్ష్యంతో పక్కాగా ప్రణాళిక వేసిన కుట్ర. ఈ ఆకస్మిక దాడిలో అధ్యక్షుడి భద్రతా బృందం చెల్లాచెదురవుతుంది. ఆ గందరగోళంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ టాఫ్ట్ (జోయెల్ కిన్నమన్) అధ్యక్షుడిని సురక్షితంగా బయటపడేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే దాడిలో అతను తీవ్రంగా గాయపడతాడు.

Advertisement

దీంతో అధ్యక్షుడే పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగిన ‘ది బీస్ట్’ కారును స్వయంగా నడుపుతూ శత్రువుల దాడులను ఎదుర్కొంటాడు. మరోవైపు గాయపడిన టాఫ్ట్‌ను కాపాడాలి.. దాడి వెనుక ఉన్న అసలు కుట్రను అడ్డుకోవాలి.. తనకు దూరమైన భార్యను తిరిగి చేరుకోవాలి. ఇలా ఒక్కో సమస్య చుట్టుముడుతుండటంతో అధ్యక్షుడి ప్రయాణం ప్రాణాంతకమైన పోరాటంగా మారుతుంది.

అసలు ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు? అధ్యక్షుడి కారులో దాగి ఉన్న రహస్య ఆయుధాలు శత్రువులను అడ్డుకోగలవా? గాయపడిన ఏజెంట్‌తో కలిసి అధ్యక్షుడు ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి ఎలా బయటపడతాడు? అనేదే సినిమా ఉత్కంఠ. కార్ ఛేజింగ్‌లు, భారీ పేలుళ్లు, తుపాకీ కాల్పులు, హైటెక్ ఆయుధాలతో సాగే ఈ చిత్రం యాక్షన్ అభిమానులకు మంచి థ్రిల్ అందించేలా ఉంటుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు ?

Advertisement

‘ది బీస్ట్’ (The Beast – 2026)లో శామ్యూల్ ఎల్. జాక్సన్ అమెరికా అధ్యక్షుడు ఆస్కార్ పల్లాడిన్‌గా, జోయెల్ కిన్నమన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ టాఫ్ట్‌గా నటించారు. గై బర్నెట్, ఈయాన్ మెకెన్, కోలిన్ మోర్గాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. రెన్నీ హార్లిన్ దర్శకత్వం వహించగా, టుయోమాస్ కాంటెలినెన్ సంగీతం సమకూర్చారు. సుమారు 99 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ 2026 అక్టోబర్ 9న అమెరికాలో థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు నుంచి Amazon Prime Videoలో రెంట్ కు అందుబాటులో ఉంది.

Read Also: ఇదేం తల్లి ప్రేమరా బాబూ… కొడుకు గెలుపు కోసం పాపనే లేపేసే ప్లాన్… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ థ్రిల్లర్

Related News

కళ్ళముందు జరిగేదంతా నిజమా? లేక మెదడు ఆడుతున్న మైండ్ గేమా?… చూస్తే బుర్రపాడయ్యే సైకలాజికల్ థ్రిల్లర్

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’… తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి రాబోతున్న ఆదర్శ కుటుంబం.. ఎప్పుడంటే?

ఓటీటీ లవర్స్ కు పూనకాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

కృష్ణుడి కోసం సర్వం వదిలేశాడు… భక్తి మార్గంలో చైతన్య మహాప్రభు చేసిన అద్భుత ప్రయాణం.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో మీ ముందుకు

ఆకాశం నుండి దిగిన మృత్యువు… అంతరిక్షం నుండే కూతురిని కాపాడుకున్న తండ్రి సాహసం… వెన్నులో వణుకు పుట్టించే సై-ఫై థ్రిల్లర్

9 ప్రాణాల్లో 8 పోగొట్టుకున్న పిల్లి… చివరి ప్రాణం కోసం భయంకరమైన తోడేలుతో పోరాటం.. పిల్లలకు, పెద్దలకు ఫుల్ మీల్స్

Big Stories

Advertisement
×