OTT Movie : హారర్ థ్రిల్లర్ మూవీలు చూడటానికి ఎంత భయంకరంగా ఉంటాయో అంతే ఎంజాయ్ కూడా చేస్తారు మూవీ లవర్స్. కొన్ని హారర్ సినిమాలు రాత్రి పూట చూడాలంటే వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయి. ఇటువంటి సినిమాలు చీకట్లో ఒంటరిగా చూడటం కూడా అంత ఈజీ కాదు. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఇందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు “ది ఆఫ్టర్ మాత్” (The Aftermath). ఈ మూవీ కొత్తగా పెళ్లయిన ఒక జంట ఒక కొత్త ఇంట్లోకి వస్తారు. ఆ ఇంట్లో వీళ్ళు ఎదుర్కొనే సమస్యలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
రాబర్ట్, క్లాడియా అనే దంపతులు తమ ఇంటిని తక్కువ ధరకే అమ్మాలనుకుంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఇద్దరు మనుషులు హత్యకు గురైఉంటారు. ఆ ఇంటిని కెవిన్, నటాలియ అనే జంట తక్కువ ధరకు రావడంతో కొనుగోలు చేస్తారు. కెవిన్, నటాలియ వారి వృత్తుల్లో బిజీగానే ఉంటారు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో, వీళ్లకు ఏవేవో శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్న కుక్కకు షాడోస్ కనపడుతూ ఉంటాయి. నటాలియ ఒక రోజు ఇంట్లో ఉండగా ఆమెను అపరిచిత వ్యక్తి చంపబోతయాడు. రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కారును తగలబెడతారు. ఈ విషయం కెవిన్, నటాలియ పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. ఒకరోజు నటాలియ చెల్లెలు డిన్నర్ ప్రిపేర్ చేస్తుండగా, ఆ ఇంట్లో ఏవేవో శబ్దాలు రావడంతో ఆమె ఒకచోట దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమెను ఏదో అదృశ్య శక్తి లాగినట్టు చూపిస్తారు. ఇంటికి వచ్చిన నటాలియ డిన్నర్ ప్రిపేర్ చేయలేదని చెల్లెలిపై కోప్పడుతూ ఉంటుంది.
అమరుసటి రోజు పోలీసులు కెవిన్ కు ఫోన్ చేసి, మీ ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు ఇంటి ఓనరే కారణమని చెప్తారు. మీ ఇంటిని ఖాళీ చేయించడానికి అతను ఇలా చేస్తున్నాడని రాబర్ట్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే రాబర్ట్ ఇదంతా తను చేయట్లేదని, ఆ ఘటనలకు నాకు సంబంధం లేదని పోలీసులకు చెప్తాడు. కెవిన్ ఒకరోజు అనారోగ్యం బారిన పడతాడు. అతనికి పరీక్షలు చేయించగా కెవిన్ పై విష ప్రయోగం జరిగిందని రిపోర్టు వస్తుంది. చివరికి ఆ ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు కారణం ఎవరు? కెవిన్ పై విష ప్రయోగం చేసింది ఎవరు? ఆ ఇంటిని ఖాళీ చేయించడానికి ఎవరైనా చేస్తున్నారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ది ఆఫ్టర్ మాత్” (The Aftermath) హర్రర్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.