OTT Movie : ఈ రోజుల్లో ప్రపంచమంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. డబ్బు ఉంటేనే విలువ అన్నట్టుగానే నడుస్తుంది కాలం. ఈ సమాజంలో విలువలతో కూడిన మనుషులు కూడా తక్కువగానే కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కోటిన్నర లాటరీ సొంతం చేసుకునే అవకాశం ఉన్నా, దానిని చేర్చాల్సిన చోటికి చేరుస్తాడు హీరో. మంచి కథతో ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జి ఫైవ్ (Zee 5) లో
ఈ మూవీ పేరు ‘తిరు. మాణిక్కం‘ (Thiru. Manickam). 2024లో విడుదలైన ఈ తమిళ మూవీకి నంద పెరియసామి రచించి దర్శకత్వం వహించాడు. ఇందులో సముద్రఖని టైటిల్ పాత్రలో నటించగా, అనన్య, భారతీరాజా, నాసర్, తంబి రామయ్య, కరుణాకరన్, ఇళవరసు సహాయక పాత్రల్లో నటించారు. ఒక లాటరీ టికెట్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
మాణిక్కం ఒక లాటరీ షాప్ నడుపుతూ ఉంటాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన మాణిక్కం కి ఇద్దరు కూతుర్లు ఉంటారు. చివరి అమ్మాయికి మాటలు రాకుండా ఉంటాయి. డాక్టర్లు ఆమెను మాటలు మాట్లాడించడానికి ట్రై చేస్తూ ఉండమని చెప్తారు. ఇది ఇలా ఉంటే మాణిక్కం ఇన్స్పెక్టర్ దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకుంటాడు. దానిని తిరిగి చెల్లించమని ఇన్స్పెక్టర్ ఒత్తిడి చేస్తుంటాడు. ఒకరోజు మాణిక్కం షాపుకి ఒక పెద్దాయన వస్తాడు. అతడు చాలా బాధల్లో ఉంటాడు. ఆ పెద్దాయన కూతుర్ని అత్తగారింట్లో నుంచి పంపించి ఉంటారు. కట్నం కోసం వేధించడంతో లాటరీ టికెట్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాడు పెద్దాయన. మాణిక్కం దగ్గర నాలుగు లాటరీ టికెట్లు కొంటాడు. డబ్బులు దారిలో పడేసుకోవడంతో, వాటిని అలాగే ఉంచమని చెప్పి మరుసటి రోజు తీసుకుంటానని వెళ్తాడు. అయితే అదే రోజు ఆ పెద్దాయన ఉంచిన లాటరీ టికెట్లకు కోటిన్నర తగులుతుంది. ఈ విషయం ఆ పెద్దాయనకి చెప్పి, లాటరీ టికెట్లు ఇవ్వడానికి అతని ఇంటికి వెళుతుంటాడు మాణిక్కం.
భార్యకి ఫోన్ చేసి విషయం అంతా చెప్తాడు మాణిక్కం. అప్పుడు భార్య అతడు ఇంకా డబ్బు ఇవ్వలేదు కాబట్టి, ఆ టికెట్లు మనకి సొంతమని చెప్తుంది. అందుకు తన మనసు ఒప్పుకోదు అంటూ మాణిక్యం ఆమె ఫోన్ ని కట్ చేస్తాడు. అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులు. అయితే మాణిక్కం అవేమీ పట్టించుకోకుండా ఆ పెద్దాయనని కలవడానికి వెళ్తూ ఉంటాడు. చివరికి మాణిక్యం లాటరీ టికెట్టు ఆ పెద్దాయనకి ఇస్తాడా? ఆ టికెట్ వల్ల మాణిక్యం ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘తిరు. మాణిక్కం’ (Thiru. Manickam) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.