Thrash Review: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తాజా సర్వైవల్ థ్రిల్లర్ ‘Thrash’. ‘బ్రిడ్జర్టన్’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నటి ఫోబ్ డైనోవర్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఇక్కడ తెలుసుకుందాం.
Read also-విజయ్ ‘జన నాయగన్’ లీక్‌పై విజయ్ దేవరకొండ ఫైర్.. ‘ఇది వ్యవస్థాగత వైఫల్యం’ అంటూ..
ఒక భారీ గ్రేడ్-5 హరికేన్ తీరప్రాంత పట్టణాన్ని అతలాకుతలం చేస్తుంది. విపరీతమైన వర్షం, వరదల వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమవుతారు. అయితే ఆ వరద నీటితో పాటే ఆకలితో ఉన్న భయంకరమైన సొరచేపలు (Sharks) పట్టణంలోకి ప్రవేశిస్తాయి. నిండు గర్భిణి అయిన కథానాయిక (ఫోబ్ డైనోవర్) ఆ వరదలో చిక్కుకుపోతుంది. ఒకవైపు పురిటి నొప్పులు, మరోవైపు చుట్టూ ముసురుతున్న షార్క్స్.. ఈ ప్రమాదకర పరిస్థితి నుండి ఆమె తనను తాను, తన బిడ్డను ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా కథ.
ఫోబ్ డైనోవర్ అద్భుత నటన: ఈ సినిమాకు ప్రధాన బలం ఫోబ్ డైనోవర్ నటన. ఒక గర్భిణి ఎదుర్కొనే శారీరక ఇబ్బందులను, ప్రాణాపాయ స్థితిలో ఉండే మానసిక ఆందోళనను ఆమె అద్భుతంగా పండించారు. విమర్శకుల నుంచి ఆమెకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఉత్కంఠభరితమైన సన్నివేశాలు: దర్శకుడు టామీ విర్కోలా కొన్ని యాక్షన్ సన్నివేశాలను చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా కారులో నీరు నిండుతున్న సమయంలో వచ్చే సీన్లు ప్రేక్షకులకు చెమటలు పట్టిస్తాయి.
Read also-మొబైల్ రీఛార్జ్ తప్పు నెంబర్‌కు చేశారా?.. అలాంటప్పుడు ఏం చేయాలాంటే?
సినిమాటిక్ లిబర్టీస్: కొన్ని చోట్ల లాజిక్ కంటే సినిమాటిక్ ఎఫెక్ట్స్‌కే దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కొన్ని సందర్భాల్లో సహజత్వానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. గతంలో వచ్చిన ‘క్రాల్’ వంటి సినిమాల ఛాయలు ఇందులో కనిపిస్తాయి.
కథనంలో ఒడిదుడుకులు: కథ రెండు భిన్నమైన పరిస్థితుల మధ్య సాగుతుంది. ఒకవైపు ఫోబ్ డైనోవర్ పోరాటం, మరోవైపు పట్టణంలోని మరికొంత మంది పిల్లల ప్రయత్నాలు. ఈ రెండు ట్రాకుల మధ్య షిఫ్ట్ అవ్వడం వల్ల సినిమా వేగం కొంత దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది.
మొత్తంగా..
‘Thrash’ ఒక పక్కా సర్వైవల్ థ్రిల్లర్. మీరు గ్రేట్ ఫిలిం మేకింగ్ లేదా బలమైన లాజిక్ ఆశించకుండా, కేవలం కొన్ని గంటల పాటు ఉత్కంఠను కలిగించే సినిమా చూడాలనుకుంటే ఇది ఒక మంచి ఛాయిస్. షార్క్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి, అలాగే ఫోబ్ డైనోవర్ అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.