Thriller movie OTT : ఈ మధ్య ఓటీటీలోకి డిఫరెంట్ స్టోరీలతో మూవీలు తెరకేక్కుతున్నాయి. ఈ మధ్య ఒకదానికి మించి మరొకటి వస్తున్నాయి. అయితే జనాలు ఎక్కువగా థ్రిల్లర్ స్టోరీలతో వచ్చే సినిమాలకే మొగ్గు చూపిస్తున్నారు. అందుకే దర్శకులు అలాంటి డిఫరెంట్ కథతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా బ్యాంక్ రాబరి నేపథ్యంలో అదిరిపోయే థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ పేరేంటి ఎక్కడ చూడచ్చో? స్టోరీలోని ట్విస్ట్ లు ఏంటో ఒకసారి చూసేద్దాం..
మూవీ..
ఏప్రిల్ 24 న థియేటర్లలోకి వచ్చేసిన మూవీ చౌర్య పాఠం. ఈ మూవీ కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలోనైనా ముందస్తు పోస్టర్లు, టీజర్లు, రివ్యూలు వస్తుంటాయి. కానీ ‘చౌర్య పాఠం’ అనే ఈ సినిమా అలాంటి ప్రమోషన్ ఏమీలేకుండా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.
ఓటీటీ..
థ్రిల్లింగ్ కథతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఏప్రిల్ 24 న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు కేవలం 20 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నవరసాలతో కూడిన మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్నవారు ‘చౌర్య పాఠం’ సినిమాను తప్పకుండా చూడవచ్చు. కామెడీ, క్రైమ్, థ్రిల్లింగ్ మరియు భావోద్వేగాలు అన్నీ కలబోతగా ఈ సినిమా రూపొందింది. స్క్రీన్ ప్లే నిత్యం మలుపులు తీస్తూ ఆసక్తిని పెంచుతుంది..
స్టోరీ విషయానికొస్తే..
చౌర్య పాఠం మూవీ బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగుతుంది.. హాలీవుడ్ లో ‘మనీ హీస్ట్’, తెలుగు సినిమాల్లో ‘జీబ్రా’ వంటి చిత్రాలు ఈ తరహాలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘చౌర్య పాఠం’ కూడా అదే కోవలో ఉంటుంది.. ఈ మూవీలో కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఈ స్టోరీలో ఓ యువకుడికి సినిమా డైరెక్టర్ అవ్వాలన్న తపన ఉంటుంది. కానీ అతనికి అవకాశాలు రాకపోవడంతో తన కలను నెరవేర్చేందుకు బ్యాంక్ దొంగతనానికి ప్లాన్ చేస్తాడు. తన ప్లాన్‌లో బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని, అలాగే అదే బ్యాంకులో పని చేస్తున్న అంజలిని భాగస్వాములుగా చేసుకుంటాడు. అయితే పక్కనే ఉన్న స్కూల్ బిల్డింగ్ నుంచి సొరంగం తోవ్వి రాబరీకి వెళ్తాడు. ఇక థియేటర్లలో విడుదలైనప్పుడు పెద్దగా పేరు ఉన్న నటీనటులు లేకపోయినా ప్రేక్షకుల ఆదరణతో యావరేజ్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో నటించిన ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరో, హీరోయిన్ పాత్రల్లో కనిపించగా, మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. సుప్రియ ఐసోల ఈ చిత్రంలో విలన్ పాత్రలో అదరగొట్టారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ కథను రాసారు. ఆ తర్వాత డబ్బులను కొట్టేశాడా? డైరెక్టర్ అయ్యాడా? ఇలాంటి ప్రశ్నలకు బ్రేక్ పడాలంటే మూవీని ఓటీటీలో చూడాల్సిందే… ప్రస్తుతం ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..