Sandeep Kishan : సినీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్, బ్రేకప్, డివోర్స్ కామన్. ఏ హీరో, హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడుస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ మధ్య ఇలాంటి వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్..టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు పర్వాలేదు దూసుకుపోతున్నాడు. ఈ హీరో ఓ యంగ్ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వార్తలకు తాజాగా హీరో సందీప్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. తనతో కలిసి పని చేసిన నటీమణులకు మంచి రెస్పెక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో తన కెరీయర్ లో హీరోయిన్ పాత్ర గురించి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.. ఆయన ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..
హీరోయిన్ తో ఎఫైర్ పై క్లారిటీ..
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, రిలేషన్ ఉండటం కామన్.. ఈ మధ్య ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. అలాగే నిత్యం ఏదోక జంట పై ఇలాంటి వార్తలు రావడం కామన్. ఇక విషయానికొస్తే యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కస్సాండ్రాతో కలిసి పలు చిత్రాల్లో మెరిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో రోటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, మానగరం వంటి చిత్రాల్లో నటించారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని టాక్ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సందీప్ కిషన్ రెజీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, మంచి స్నేహితులం. మామధ్య అలాంటివి ఏమి లేవు. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చేశాడు. త్వరలోనే వీరిద్దరి కాంబోలో మరో మూవీ రాబోతుందని టాక్..
Also Read :
సందీప్ కిషన్ సినిమాలు..
హీరో సందీప్ కిషన్ ప్రస్థానం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. స్నేహా హిందీలోనూ ఓ సినిమా చేశారు. గుండెల్లో గోదారి చిత్రం తో సపోర్టింగ్ రోల్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, డీ ఫర్ దోపిడీ, రారా క్రిష్ణయ్య, జోరు, బీరువా, టైగర్, రన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ను బ్యాక్ టు బ్యాక్ వెండితెరపై అలరించారు. ఇలా 15 ఏళ్లుగా హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూన్నాడు.. చివరిగా ఊరు పేరు బైరవకోన, రాయన్, మజాకా వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఓ రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.