Sravanthi Chokkarapu : బుల్లితెర యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదట్లో యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం బుల్లితెరపై జరుగుతున్న సినిమా ఈవెంట్లలో మెరుస్తుంది. ఈమె అందంతోపాటు ఈవెంట్ కు తగ్గట్లు రెడీ అవ్వడంతో ఈమె ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో హీరోయిన్ ను మించిన ఫాలోయింగ్ ఈమెకుంది అనడంలో సందేహం లేదు. ఒకవైపు చేతినిండా ఈవెంట్ ఒకవైపు చేతినిండా ఈవెంట్ లో ఉన్నా కూడా మరోవైపు నెట్టింట హాట్ అందాలతో ఫోటోషూట్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది.. అయితే తాజాగా ఈమె గొప్ప మనసు చాటుకుంది. ఇటీవల జరిగిన పాక్, భారత్ వార్ లో ప్రాణాలను వదిలిన వీర జవాన్ కు భారీగా ఆర్థిక సాయాన్ని అందించింది.. ఇది విన్న నెటిజన్లు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు..
మురళీ నాయక్ కుటుంబానికి స్రవంతి సాయం..
ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల ఊచకోతలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది.. దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ సైన్యం దాడులు చేసింది. ఈ యుద్ధంలో శత్రు సైన్యం తో పోరాడుతూ పలువురు భారత సైనికులు అమరులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా కళ్లెతండాకు చెందిన మురళీ నాయక్ కూడా ఒకరు.. ఒక్కగానొక్క కుమారుడు దాడిలో అమరుడవ్వడంతో అతని పేరెంట్స్ బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. చేతికి అందోచ్చిన కొడుకు దూరం అవ్వడంతో వాళ్ళ బాధ భరించలేనిది.. వారి కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు అండగా ఉంటున్నారు.. ఈ మేరకు యాంకర్ స్రవంతి కూడా ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
Also Read: నెటిజన్ గూబ గుయ్యిమనిపించిన మాళవిక.. అసలేం జరిగిందంటే..?
వీర జవాన్ కు యాంకర్ భారీ సాయం..
గౌతమ్ హీరోగా నటిస్తున్న సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మురళీ నాయక్ పేరెంట్స్ ముఖ్య అతిధులుగా వచ్చారు. తమ వంతుగా ఆర్ధిక సాయం చేస్తామని చెప్పింది. దీనిలో భాగంగా లక్ష రూపాయలను ఈవెంట్ అవ్వగానే వారికి ట్రాన్స్‌ఫర్ చేస్తానని తెలిపింది. అదే వేదిక పై ఉన్న ఈ మూవీ సంగీత దర్శకుడు కూడా త్వరలో కల్లితండా గ్రామానికి వెళ్లి మ్యూజిక్ కన్సర్ట్ చేసి వచ్చిన డబ్బును మురళీ నాయక్ కుటుంబానికి అందిస్తానని ప్రకటించారు. ఆ ఈవెంట్ కు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకొనని ఆయన అన్నారు. యాంకర్ స్రవంతి పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది స్టార్స్ కంటే ఈమె బెటరంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ప్రస్తుతం సోషల్ మీడియా లో యాంకర్ స్రవంతి పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మధ్య స్రవంతి వరుస ఈవెంట్స్ లతో బిజీగా ఉంది. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్ లు వేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంది..