OTT Movies : ఓటీటీలో కొత్త కంటెంట్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. అందులో హారర్ సినిమాలకు ఈ మధ్య ఎక్కువ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.. అమ్మాయిల పై దాడుల గురించి కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ వ్యూస్ ను రాబడుతున్నాయి. అయితే తాజాగా ఓ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్ వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వెబ్ సిరీస్ & ఓటీటీ..
ఇదొక కన్నడ వెబ్ సిరీస్.. కన్నడ స్టార్ ఖుషి రవి ప్రధాన పాత్ర పోషించిన అయ్యన మనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ఈ సిరీస్ రూపొందింది.. రమేశ్ ఇందిర దర్శకత్వం వహించారు. రీసెంట్‍గా వచ్చిన ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా వచ్చేసింది. అయ్యన మనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 25వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. అయితే కేవలం కన్నడలోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా డబ్బింగ్ అవుతాయోమో చూడాలి..
Also Read :ఈ వారం ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ సినిమాలను డోంట్ మిస్..
స్టోరీ విషయానికొస్తే..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్తగా థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఎంతగా ప్రేక్షకులను అలరిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. అయ్యన మనే స్టోరీ విషయానికొస్తే.. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో అయ్యన మనే వెబ్ సిరీస్ సాగుతుంది. చిక్కమాగళూరూ లోని ఓ పూర్వికుల భవనంలో అయ్యన మనే కుటుంబం ఉంటుంది. ఆ ఇంటికి కోడళ్లుగా వచ్చిన ముగ్గురు అమ్మాయిలు వరుసగా మరణిస్తారు. అయితే వారు ముగ్గురు చనిపోయిన విషయాన్ని బయటకు రానివ్వకుండా ఆ కుటుంబం దాచేస్తుంది. అదే ఇంటికి మరో అమ్మాయి కోడలుగా వస్తుంది. అనుమానాస్పదంగా చనిపోయిన అమ్మాయిల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. నిజాలను బయటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది.. చివరకు ఆ అమ్మాయిలు ఎలా చనిపోయారో తెలుసుకుంటుందా? ఈ స్టోరీ ఆ ముగ్గురి చావు చుట్టే తిరుగుతుంది. ఇక ఇందులో ఖుషీ రవితో పాటు అక్ష్య నాయక్, మానసి సుధీర్, విజయ్ శోభరాజ్, రమేశ్ ఇందిర కీలకపాత్రలు పోషించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‍ను తెరకెక్కించారు డైరెక్టర్ రమేశ్ ఇందిర.. ఏప్రిల్ 25 నుంచి ఈ సిరీస్‍ను జీ5లో చూడొచ్చు. ఈ సిరీస్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఇది ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..
ఇక ప్రస్తుతం జీ5 లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇటీవల కింగ్‍స్టన్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించారు. థియేటర్లలో మార్చి 7న రిలీజై మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. కానీ ఓటీటీలో మాత్రం బాగానే వ్యూస్ ను రాబడుతుంది.