Singer Pravasthi : బుల్లితెరపై సింగర్స్ కోసం ప్రత్యేకంగా ప్రసారమవుతున్న ఏకైక షో పాడుతా తీయగా.. ఈ షో ద్వారా తమలోని సింగింగ్ టాలెంట్ ని బయట పెడుతున్నారు.. ఎంతోమంది సింగర్స్ ప్రస్తుతం సినిమాల్లో వరుసగా పాటలు పాడుతూ బిజీగా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ షోలో ఎంతోమంది సింగర్స్ పాల్గొన్నారు. అయితే గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది ఈ షోలో పాల్గొన్న సింగర్ ప్రవస్తి సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ షోలో కొంతమందికి మాత్రమే న్యాయం జరుగుతుందని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఈ షో పై నెట్టింట అనేక చర్చలు జరుగుతున్నాయి. సింగర్ ప్రవస్థి చేసిన ఆరోపణలపై ఒక్కొక్కరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కూడా ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
పాడుతా తీయగా షో లో చీకటి కోణాలు..
సింగర్స్ లోని టాలెంట్ ని బయటకు తీసేందుకు దివంగత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ షో ని ప్రారంభించారు. ఎన్నో సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో బాల సుబ్రహ్మణ్యం లేకపోవడంతో ప్రస్తుతం ఆయన కుమారుడు ఆధ్వర్యంలో ఈ షో జరుగుతుంది. ఈ షోలో సింగర్స్ ను గుర్తించడం లేదని జడ్జిలపై ఆరోపణలు చేస్తూ సింగర్ ప్రవస్థి ఓ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం అది టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. సోషల్ మీడియా వేదికగా గతంలో పాల్గొన్న సింగర్స్ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే ప్రవస్తి ఈ షోలో జరుగుతున్న చీకటి కోణాలని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తుంది.
ఈ షోలో ఎక్స్ పోజింగ్ చేయమన్నారు అని, బలవంతంగా డ్యాన్సులు వేయమన్నారు అని, తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. తనకంటే సరిగ్గా పాడని వాళ్ళను కూడా మెచ్చుకున్నారని, జడ్జీలు తనని ఒక చీడపురుగులా చూసారని వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సింగర్ సునీతపై కూడా ఆరోపణలు చేసింది. సింగర్ సునీత తనని కావాలని టార్గెట్ చేసిందని ఆమె అన్నారు. నాకు అన్యాయం జరిగిందని మా అమ్మ అడిగితే మర్యాద లేకుండా మాట్లాడరని అందుకే చీకటి కోణాన్ని బయట పెడుతున్నానని ప్రవస్తి చెబుతుంది.
కులాన్ని వేలెత్తి చూపిస్తున్నారు.. సింగర్ ఆవేదన..
పాడుతా తియ్యగా షో లో టాలెంట్ కన్నా కులానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.. అలాగే ఆ షోలో మొత్తం ఒకే కులం వాళ్లని మాత్రమే ఉంచుతున్నారు. ఇక విన్నర్ గా కూడా వాళ్లని ఎంపిక చేస్తున్నారని ప్రవస్తి ఆరోపించింది. ప్రస్తుతం ప్రవస్తి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ షో గురించి కొందరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈ షో గురించి ప్రవర్తి చెప్పడంతో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సింగర్ ప్రవస్తికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సపోర్ట్ గా నిలిచారు.. ఆయన ఏమన్నారంటే…
Also Read : ఈ వారం ఓటీటీలోకి 20 సినిమాలు.. ఆ సినిమాలను డోంట్ మిస్..
బిగ్ టీవీ తో నిర్మాత నట్టి కుమార్..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటి కుమార్ తాజాగా బిగ్ టీవీ తో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాభిషేకం, పాడుతా తీయగానే కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పుడు ఈ షోలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ మధ్య మాత్రం కమర్షియల్ అయిపోయింది.. ఇవి సినిమాలు కాదు కదా.. ఇటీవల ఈ షోలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. వాళ్ల క్యాస్ట్ వాళ్ళని మాత్రమే విన్నర్స్ గా చేస్తున్నారని ఆయన అంటున్నారు. ప్రవస్తికి మద్దతుగా నిలుస్తానని ఆయన చెప్తున్నారు. ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి ఇలాంటివి బయటకు వచ్చి ఎప్పుడు చెప్పుకోదు. కానీ ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటే ఇలాంటివి బయట పెట్టిందో అర్థం చేసుకోవాలని ఆయన చెప్తున్నారు. అమ్మాయికి న్యాయం జరిగేంతవరకు నేను సపోర్ట్ గా ఉంటానని నిర్మాత అంటున్నారు. ప్రవస్థితికి నిర్మాత సపోర్ట్ గా నిలవడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఈ షో గురించి బయట పెడుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలోనూ అటు మీడియాలోనూ వస్తున్న వార్తలపై షో నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..