Dhee 20 Promo: బుల్లితెరపై ప్రసారం అవుతున్న డ్యాన్స్ షో ఢీ.. ఈ షో ఇప్పటికే 19 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు 20 సీజన్ కోసం సర్వం సిద్ధంగా ఉంది. ఈ కొత్త సీజన్ కాన్సెప్ట్ ప్రోమోని తాజాగా వదిలారు. అయితే ఈసారి కొత్తవారితో కాకుండా సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వారిని కంటెస్టెంట్లుగా తీసుకోబోతున్నారు. పల్సర్ బైక్ ఝాన్సీ, జాను లిరి, అన్షురెడ్డి సహా మొత్తం కంటెస్టెంట్ల లిస్ట్ వచ్చేసింది.. కంటెస్టెంట్స్ తో పాటుగా ఈ సీజన్ లో జడ్జిలు ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా మారింది.. గత సీజన్లో హీరోయిన్ హన్సిక మోత్వాని జడ్జిగా వ్యవహారించారు. ఇప్పుడు ఆమె ప్లేసులో మరో కొత్త హీరోయిన్ రాబోతుందని తెలుస్తుంది. ఇక అస్సలు ఆలస్యం లేకుండా ఏ హీరోయిన్ సందడి చేయబోతుందో ఒకసారి తెలుసుకుందాం..
ఢీ కొత్త సీజన్ ప్రోమో హైలెట్స్..
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాప్ డ్యాన్స్ ఐకాన్ షో ఢీ కొత్త సీజన్ ప్రారంభం కానంది. ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీజన్‌లో కొన్ని మార్పులు చేశారు. అలానే కంటెస్టెంట్లుగా సెలబ్రెటీలని తీసుకువస్తున్నారు. ఈ సీజన్ ఇది సార్ మా బ్రాండ్ అనే ట్యాగ్‌తో కొత్త ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఈ సీజన్‌కి కూడా యాంకర్‌గా నందు కొనసాగుతున్నాడు.. తన ఇంట్రోతోనే ప్రోమో మొదలవుతుంది. ఢీ కొత్త సీజన్‌లో అభి, సుస్మిత, అన్షురెడ్డి, జతిన్, భూమిక, పండు, రాజు, మణికంఠ, పల్సర్ బైక్ ఝాన్సీ, జాను లిరి, రాజా నందిని కంటెస్టెంట్స్‌గా పోటీ పడుతున్నారు.. ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా రాబోతున్న వారంతా గత సీజన్లలో పరిచయమైన వాళ్లే కావడం విశేషం. వీల్లు కాకుండా మిగిలిన వాళ్ళు మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నవారే అని తెలుస్తుంది
హన్సిక ఔట్.. కొత్త జడ్జి ఎవరంటే..?
గత సీజన్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని జడ్జిగా వ్యవహరించింది.. అయితే ఈ సీజన్ ప్రోమోలో జడ్జిగా హన్సిక కనిపించలేదు.. ఆమె స్థానంలో రెజీనా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక బిన్ని, విజయ్ మాస్టర్లు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నారు.. ఈ బుధవారం రాత్రి 9.30 గంటలకి కొత్త సీజన్ లాంఛ్ కాబోతుంది..
Also Read :మంచు మోహన్ బాబు అబద్దం చెప్పాడు… దాన్ని మీరందరూ నమ్మేశారు..
ప్రదీప్ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశ..
అయితే ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ మాత్రం కాస్త హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే యాంకర్ ప్రదీప్ మళ్లీ షోకి వస్తాడని అందరూ అనుకున్నారు.. గత సీజన్లలో హైపర్ ఆది, దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ లు, రష్మీ గౌతమ్ లు మెంటర్స్ గా వస్తే బాగుండు అని అనుకున్నారు..జడ్డీలుగా శేఖర్ మాస్టర్, హీరోయిన్ ప్రియమణి, పూర్ణలు కావాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అవేమీ లేకుండా మళ్లీ నందూనే యాంకర్ కావడంతో నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు.. సీరియల్ నటి అన్షు రెడ్డి కూడా డాన్సర్ గా పాల్గొనబోతుంది.. మొత్తానికి అయితే ఈ సీజన్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని ప్రోమో ను చూస్తే అర్థమవుతుంది. మరి ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో అన్నది ఆసక్తిగా మారింది..