OTT Movie : సినిమాలతో పాటు, ఇప్పుడు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో దుమ్ము లేపుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వీటిని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సెన్సార్ నిబంధనలు కూడా అంతగా లేకపోవడంతో, డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ కి అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. కొన్ని వెబ్ సిరీస్ లను ఫ్యామిలీ తో కలసి అస్సలు చూడలేము. ఎప్పుడు ఎటువంటి సీన్స్ వస్తాయో అని కంగారు పడుతున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. సముద్ర తీరంలో జరిగే ఈ సిరీస్ ను ఒంటరిగా చూడటమే మంచిది. ఈ ఆస్ట్రేలియన్ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ కాల్ మెక్‌టీర్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక టీనేజ్‌లో జరిగిన హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని, పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తుంది. తన స్వస్థలమైన ఓర్ఫెలిన్ బే అనే చిన్న చేపలు పట్టే గ్రామానికి తిరిగి వస్తుంది. అక్కడికి తిరిగి వచ్చిన తర్వాత తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో తిరిగి పరిచయం పెంచుకుంటుంది. వారిలో కొందరు ఆమెను చూడటానికి కూడా ఇష్టపడరు. ఒకరోజు ఒక స్థానిక మత్స్యకారుడి మృతదేహం తీరానికి కొట్టుకొస్తుంది. ఈ హత్య వెనుక ఉన్న రహస్యాలను కనిపెట్టడానికి కాల్ ప్రయత్నిస్తుంది. గ్రామంలోని కొంతమంది పై అనుమానం కూడా వస్తుంది. ఇక్కడ నీటి మనుషులు , సముద్ర జాలర్ల మధ్య అప్పుడప్పుడు లైంగిక సంబంధాల ఫలితంగా ‘టైడ్‌ల్యాండర్స్’ అని పిలువబడే ప్రమాదకరమైన సంతతి ఏర్పడుతుంది. వీళ్ళు ఆ సముద్రతీరంలో బలమైన వ్యక్తులుగా ఉంటారు. మాదకద్రవ్యాలను కూడా సరఫరా చేస్తుంటారు.
ఈ క్రమంలో కాల్ సోదరుడు కూడా, మాదకద్రవ్యాల తయారీ, లావాదేవీల ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాడని ఆమె కనిపెడుతుంది. కాల్ కి కూడా టైడ్‌ల్యాండర్స్ కి ఉండే ప్రత్యేకమయిన శక్తులు ఉంటాయి. నీటిలో ఎక్కువ సేపు ఉండటం, పెద్ద బరువులు మోయడం లాంటివి ఉంటాయి. ఇప్పుడు కాల్ తన గతం జ్ఞాపకాలను తలచుకుంటూ, గ్రామంలోని రహస్యాలను తెలుసుకుంటూ ఉంటుంది. చివరికి కాల్ కి తన సొంత గ్రామంలో ఎటువంటి సమస్యలు వస్తాయి ? సముద్ర తీరంలో జరుగుతున్న నేరాలను ఎవరు నడుపుతుంటారు ? కాల్ ఆ గ్రామంలో ఎటువంటి మార్పులు తెస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఆస్ట్రేలియన్ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఆ ఇంట్లో రెంట్ కు అడుగు పెట్టడం అంటే నరకంలోకి వెళ్ళడమే… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ ఆస్ట్రేలియన్ వెబ్ సిరీస్ పేరు ‘టైడ్‌ల్యాండ్స్’ (Tidelands). ఎనిమిది ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్‌ను స్టీఫెన్ ఎం. ఇర్విన్, లీ మెక్‌గ్రాత్ రూపొందించారు. దీనిని హుడ్లమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఇది 2018 డిసెంబర్ 14 న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైంది.