BigTV English
Advertisement

OTT Movie : మూడు తరాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్రేజీ కొరియన్ సిరీస్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie : మూడు తరాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్రేజీ కొరియన్ సిరీస్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie : కొరియన్ వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్నాయి. వీటిని ప్రేక్షకులు ఇష్టంగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను ఒక్కసారి చూస్తే, ఇక ఆపకుండా చూస్తూనే ఉంటారు. రేటింగ్ లో కూడా ఇది టాప్ లో ఉంది. మైండ్ రిలాక్స్ కోసం ఈ వెబ్ సిరీస్ ను ఒకసారి ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ఆసున్ పేద కుటుంబంలో జన్మించిన ఒక అమ్మాయి. ఆమె తల్లి మరణించిన తర్వాత, ఆసున్ తన చిన్న తోబుట్టువుల బాధ్యతను తీసుకుంటుంది. అయితే తన తండ్రి వేరొక మహిళతో సంబంధం పెట్టుకోవడంతో, అతని మీద కోపంగా ఉంటుంది. ఆమె బాగా చదువుకుని జీవితంలో ఎదగాలని కలలు కంటుంది. కానీ పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్లలేకపోతుంది. ఆమె జెజు అనే దీవిలో నివసిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి బయటపడి పాడాలని అనుకుంటుంది. మరోవైపు గ్వాన్-సిక్ అనే యువకుడు, ఆసున్‌ను ఎల్లప్పుడూ రక్షిస్తూ, ఆమె పక్కన నిలబడే వ్యక్తిగా ఉంటాడు. అతను, ఆసున్‌ను ని గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు ఎవరికీ తెలీకుండా వీళ్ళు ఆ దీవి నుంచి లేచిపోతారు.


సిటీకి వెళ్ళి ఈ జంట చాలా ఇబ్బందులు పడతారు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను మోసం చేసి తీసుకుంటారు. ఇక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. ఇప్పుడే అసలు స్టోరీ మొదలౌతుంది. పెళ్లి తరువాత వీళ్ళకు ముగ్గురు పిల్లలు కూడా పుడతారు.గ్వాన్-సిక్ చేపలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఒక రోజు బాగా తుఫాన్ రావడంతో, చిన్న కొడుకు చనిపోతాడు. ఈ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ఆతరువాత తనలా తన కూతురి జీవితం కాకూడదనుకుని బాగా కష్టపడి చదివిస్తారు తల్లి దండ్రులు. చివరికి తల్లి ఆశయాలను కూతురు నెరవేరుస్తుందా ? తండ్రి కూతురిని ఎలా గైడ్ చేస్తాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే , ఈ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : అటాప్సీ రూమ్ లో అరుపులు పుట్టించే సీన్స్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

 

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో

ఈ కొరియన్ వెబ్ సిరీస్ పేరు ‘వెన్ లైఫ్ గివ్స్ యు టాంజరీన్స్’ (When Life Gives You Tangerines). దీనికి కిమ్ వోన్-సియోక్ దర్శకత్వం వహించారు ఇందులో పార్క్ బో-గమ్ , మూన్ సో-రి మరియు పార్క్ హే-జూన్ నటించారు. ఇది జెజు దీవిలో జన్మించిన ఓ ఆసున్, గ్వాన్-సిక్ అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ 1950ల నుండి 2025 వరకు నాలుగు దశాబ్దాలలో జరిగే జీవితాలను, ప్రేమను, కష్టాలను, విజయాలను చూపిస్తుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా, ఈ సిరీస్ విజయం సాధించింది. స్క్రీన్‌ప్లే, దర్శకత్వంకి ప్రశంసలను కూడా  అందుకుంది. ఇది 61వ బేక్సాంగ్ ఆర్ట్స్ అవార్డులలో ఉత్తమ అవార్డును గెలుచుకుంది . ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

Big Stories

×