Tv Serial : తెలుగు ప్రేక్షకులను వినోదాన్ని పంచుతున్న వాటిలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ఉన్నాయి.. తెలుగులో ఎక్కువగా సీరియల్స్ జనాలని బాగా అలరిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈమధ్య వస్తున్న సీరియల్స్ కంటెంట్ తో పాటు కాస్త కామెడీ, రొమాన్స్, ట్రెండ్ అవుతున్న వాటి పై ఫోకస్ చేస్తున్నారు. ట్రెండింగ్ టాపిక్స్ ను తీసుకొని సీరియల్ లో ఒక ఎపిసోడ్ ను చేస్తున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ తెలుగు సీరియల్ లో అఘోరి పాత్రతో సీన్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఆ సీరియల్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
జీతెలుగు లో ప్రసారం అవుతున్న సీరియల్..
తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్న ప్రముఖ టీవీ ఛానెల్స్ లలో జీతెలుగు ఒకటి. ఈ ఛానల్ ఎక్కువగా దేవుళ్ళకి సంబంధించిన సీరియల్స్ నని ప్రసారం చేస్తుంది. ఈ మధ్య కాస్త ట్రెండు మారినట్టు ఉంది. యూత్ ని కూడా ఆకట్టుకునే విధంగా సీరియల్స్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ లలో చామంతి కూడా ఒకటి.. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు సంబందించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో చామంతి అఘోరిగా మారింది. ఇంట్లోని వాళ్లంతా గుడికి తీసుకొని వెళ్తారు. అక్కడ సీన్ ను కామెడీగా ఉండటంతో పాటుగా అఘోరి క్రేజ్ ను బాగా వాడేసుకున్నారుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ను అందుకుంటుంది. ఆ సీన్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్..
నెటిజన్స్ రియాక్షన్ ఏంటంటే..?
ఈ సీన్ చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.. చూసే జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు కదరా.. మరొకరి ఏంటి దరిద్రం.. ఏం చేస్తున్నారు. మిమ్మల్ని చంపెయ్యాలి అంటూ కామెంట్ చెయ్యగా, వీళ్ళు చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం. అఘోరిగా బాగానే చేశారు. అంటూ ఈ సీరియల్ పై కొందరు పాజిటివ్గా కామెంట్ చేస్తే.. ఈ సీన్ చూసిన తర్వాత నెగిటివ్గా కామెంట్లు వస్తున్నాయి.. మొత్తానికి ఈ వీడియో క్లిప్ అయితే సోషల్ మీడియాలో నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది.. ఆ సీన్ ఏంటో మీరు కూడా ఇటు లుక్ వేసుకోండి..
Also Read :మగవాళ్లకు చాలాసార్లు లొంగిపోయాను.. ఆ హీరోతో రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్..
తెలుగు సీరియల్స్..
తమ సీరియల్ ముందుకు వెళ్లాలని కొందరు విచిత్రమైన మ్యాజిక్ లు గ్రాపిక్స్ ను చేస్తున్నారు. సీరియల్స్ కు ఈ మధ్య సినిమాలకు మించిన క్రేజ్ ఉంది. అందుకే సినిమాల కన్నా ఎక్కువగా డైలీ సీరియల్స్ కే ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఎవరికి వారే అన్నట్లు ప్రయోగాలు చేసుకున్నారు. ఇక ముందుకు టీఆర్పీ కోసం ఎలాంటి మ్యాజిక్ లు చేస్తారో, జిమ్మిక్కులు చేస్తారో చూడాలి..
?igsh=MXBjb2FxN2U1ZGV4MQ==