E-Paper
Advertisement

30 ఏళ్ల క్రితం మాయమైన పడవ రిటర్న్… దానితో పాటు వచ్చే టైమ్ ట్రావెల్ మిస్టరీ… చివరికి ఊహించని ట్విస్ట్

30 ఏళ్ల క్రితం మాయమైన పడవ రిటర్న్… దానితో పాటు వచ్చే టైమ్ ట్రావెల్ మిస్టరీ… చివరికి ఊహించని ట్విస్ట్
Advertisement

Time Travel Sci-fi Thriller: ఒకవైపు సముద్రంలో కనిపించకుండా పోయిన పాత పడవ… మరోవైపు ఏళ్ల తర్వాత తిరిగొచ్చే అదే పడవ… కానీ దానిలో వెళ్లిన వాళ్లు తిరిగి ఒడ్డుకు చేరేసరికి కాలమే మారిపోతే ? 30 ఏళ్ల క్రితం మాయమైన వాళ్లు వీళ్ళేనని అక్కడి ప్రజలు గుర్తిస్తే ? తన కుటుంబం ఉన్న భవిష్యత్తుకు తిరిగి వెళ్లాలనుకునే వ్యక్తి… గతంలోనే కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకునే మరో వ్యక్తి మధ్య చిక్కుకుంటే? అసలు ఈ కాల రహస్యం వెనుక ఉన్న నిజమేంటి? గతాన్ని మార్చితే భవిష్యత్తు ఏమవుతుంది? ఇదే మిస్టరీ, టైమ్ ట్రావెల్, ఎమోషన్‌తో సాగే బ్రిటిష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘రోజ్ ఆఫ్ నెవాడ’ (Rose of Nevada). మరి ఈ సినిమా ఏ ఓటీటీ ఉంది ? తెలుగులో అందుబాటులో ఉందా ? అసలు కథేంటి? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక చిన్న మత్స్యకార గ్రామంలో 30 ఏళ్ల క్రితం సముద్రంలోకి వెళ్లి అదృశ్యమైన ‘రోజ్ ఆఫ్ నెవాడ’ అనే పడవ అకస్మాత్తుగా తిరిగి రేవుకు చేరుతుంది. పడవ కనిపించడంతో గ్రామంలో ఆసక్తి మొదలవుతుంది. దాన్ని మళ్లీ సముద్రంలోకి పంపాలని నిర్ణయించడంతో, డబ్బు అవసరమైన నిక్, తన గతం నుంచి తప్పించుకోవాలని చూస్తున్న లియామ్ ఆ బోటు సిబ్బందిలో చేరతారు.

Advertisement

సముద్రంలోకి వెళ్లిన వీళ్లకు పెద్దగా ఏ సమస్య ఎదురుకాదు. కానీ తిరిగి ఒడ్డుకు చేరుకున్న క్షణంలో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. తాము వెళ్లిన అదే గ్రామమే అయినా… అక్కడి మనుషులు, వాతావరణం, పరిసరాలు అన్నీ వింతగా అనిపిస్తాయి. కొద్దిసేపటికే వాళ్లకు అసలు విషయం అర్థమవుతుంది. తాము 30 ఏళ్లు వెనక్కి, 1993లోకి వెళ్లామని.

అంతేకాదు, అక్కడి వాళ్లు నిక్, లియామ్‌లను అప్పట్లో అదృశ్యమైన పడవ సిబ్బందిగానే గుర్తిస్తారు. దీంతో ఇద్దరి పరిస్థితి తలకిందులవుతుంది. నిక్‌కు మాత్రం ఈ గతంలో ఉండటం అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తన భార్య, కూతురు ఉన్న భవిష్యత్తుకు ఎలాగైనా తిరిగి వెళ్లాలని అతను కోరుకుంటాడు. కానీ తాను చెప్పేది నిజమని ఎవరూ నమ్మరు.

Advertisement

లియామ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఆలోచిస్తాడు. తనకు తిరిగి వెళ్లేందుకు పెద్దగా బంధాలు లేకపోవడంతో, ఈ గతంలోనే ఉండిపోవచ్చని భావిస్తాడు. పైగా తనను గతంలో భర్తగా కోరుకునే ఓ మహిళ అతని జీవితంలోకి రావడంతో, కొత్త జీవితంపై అతనికి ఆసక్తి పెరుగుతుంది.

మరోవైపు భవిష్యత్తులో ఆ గ్రామం పేదరికం, నిరాశతో కూరుకుపోయి ఉండగా…1993లో మాత్రం అక్కడి ప్రజలు ఆశలతో సంతోషంగా జీవిస్తుంటారు. దీంతో నిక్ ముందు ఓ పెద్ద ప్రశ్న నిలుస్తుంది. తాను తిరిగి భవిష్యత్తుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే… గతంలో జరిగే పరిణామాలు మారిపోయి, అక్కడి ప్రజల భవిష్యత్తు మరింత దారుణంగా మారుతుందా ? లేక కాలం తన దారిలోనే వెళ్లనివ్వాలా ? చివరికి నిక్ తన కుటుంబం కోసం తిరిగి వెళ్లాలనుకుంటాడా? లియామ్ గతంలోనే కొత్త జీవితాన్ని ఎంచుకుంటాడా? ఈ ఇద్దరి నిర్ణయాలు ఆ గ్రామ భవిష్యత్తును మార్చేస్తాయా? కాలంతో ఆడుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే ‘రోజ్ ఆఫ్ నెవాడ’ కథ.

ఏ ఓటీటీలో ఉందంటే ?

టైమ్ ట్రావెల్, మిస్టరీ, కుటుంబ బంధాలు, మనిషి తీసుకునే నిర్ణయాల ప్రభావం చుట్టూ తిరిగే టైమ్ ట్రావెల్ సై-ఫై సస్పెన్స్ థ్రిల్లర్ ‘రోజ్ ఆఫ్ నెవాడ’. జార్జ్ మాకే, కల్లమ్ టర్నర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అవార్డు గ్రహీత బ్రిటిష్ దర్శకుడు మార్క్ జెంకిన్ (Mark Jenkin) ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో (Prime Video)లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.

Read Also: కోట్లాది మంది చూసిన ఈ రెండు సిరీస్‌లకు నెట్‌ఫ్లిక్స్ గుడ్‌బై… లాస్ట్ ఛాన్స్ భయ్యా

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×