E-Paper
Advertisement

‘గీతాంజలి’ మళ్లీ వస్తోంది.. ఈసారి 4Kలో! నాగార్జున ఫ్యాన్స్‌కి పండగే

‘గీతాంజలి’ మళ్లీ వస్తోంది.. ఈసారి 4Kలో! నాగార్జున ఫ్యాన్స్‌కి పండగే
Advertisement

Geethanjali Re-Release:కొన్ని సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.కానీ కొన్ని సినిమాలు మన మనసుల్లో పాతుకుపోతాయి.అలాంటి సినిమాలలో ఒకటి నాగార్జున నటించిన ‘గీతాంజలి’. అప్పట్లో ప్రేమకథగా ప్రేక్షకులను మెప్పించిన ఈ క్లాసిక్ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వస్తోంది, అది కూడా.. 4K వర్షన్‌లో కావడం విశేషం.

ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీతో రీ-మాస్టరింగ్ చేశారు. విజువల్స్, కలర్స్, సౌండ్ క్వాలిటీని మరింత బెస్ట్ గా చేసి ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్.నాగార్జున పుట్టినరోజు, రాఖీ పండుగ సందర్భంగా శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

లవర్‌బాయ్‌గా కూడా సరికొత్త క్రేజ్

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే 1989లో వచ్చిన ‘గీతాంజలి’ అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రేమను చాలా కొత్తగా చూపించారు మణిరత్నం. మామూలు కమర్షియల్ లవ్‌స్టోరీలా కాకుండా ప్రేమలో ఉండే ఫీల్, ఎమోషన్, బాధ, ఆనందం అన్నింటినీ చాలా సహజంగా చూపించడంతో ఆ ఫీల్ ఇప్పటికీ ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయింది.ఇక అదే సమయంలో వచ్చిన ‘శివ’తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున, ఈ సినిమాతో లవర్‌బాయ్‌గా కూడా సరికొత్త క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం.

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం ఇళయరాజా సంగీతమనే చెప్పాలి. మణిరత్నం విజువల్స్‌కి ఆయన మ్యూజిక్ తోడవడంతో ప్రతీ పాట ఒక మ్యాజిక్‌లా మారిపోయింది. ఇప్పుడు థియేటర్‌లో అదే పాటలు 4K విజువల్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వినిపించబోతుండటంతో ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ రావడం పక్కా.

జెన్ జీ ఎలా రిసీవ్ చేసుకుంటారో !

Advertisement

ఇక ఇప్పటి జనరేషన్‌లో చాలామంది ఈ సినిమాను టీవీల్లోనో, యూట్యూబ్‌లోనో చూసి ఉంటారు, కానీ బిగ్ స్క్రీన్‌పై 4K వర్షన్‌లో చూడటం మాత్రం ఒక సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

also read :బాలయ్య అసలు సీక్రెట్ బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ!

మణిరత్నం కెరీర్‌లో ‘రోజా’, ‘బొంబాయి’ చిత్రాలకు ముందే వచ్చిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ కోసం పాత తరం ఫ్యాన్స్‌తో పాటు ఈతరం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చూడాలి మరి ఆగస్ట్ 28న మళ్ళీ రానున్న ఈ ‘గీతాంజలి’ని జెన్ జీ ఎలా రిసీవ్ చేసుకుంటారో !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×