E-Paper
Advertisement

ఆ రోజు వచ్చేసరికి నేను చనిపోయి ఉంటా.. తేజ వైరల్ కామెంట్స్

ఆ రోజు వచ్చేసరికి నేను చనిపోయి ఉంటా.. తేజ వైరల్ కామెంట్స్
Advertisement

Director Teja:దర్శకుడు తేజ అంటే ఇప్పటి వాళ్ళకి పెద్దగా తెలీకపోవచ్చేమో కాని అప్పట్లో ఆయన ఒక సంచలనం. ‘చిత్రం’, ‘నువ్వు-నేను’, ‘జయం’ సినిమాలతో అప్పట్లో యూత్‌ను ఊపేసిన ఆయన, కథలను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించడంలో దిట్ట అనే చెప్పాలి.కేవలం ప్రేమ మాత్రమే కాకుండా మనుషుల మధ్య ఉండే రకరకాల ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా చూపించడంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్.

ప్రేమంటే అదే కాదు

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. సినిమాలు, ప్రేమ, దేవుడు, ఎమోషన్స్, ఆహారం గురించి మాట్లాడిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.ప్రేమ గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే తనకు లవ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు తేజ. అయితే ఆయన దృష్టిలో ప్రేమ అంటే కేవలం ఒక హీరో, హీరోయిన్ మధ్య ఉండేది మాత్రమే కాదని , మనుషుల మధ్య ఉండే అనుబంధం, ప్రతి ఎమోషన్ కూడా ప్రేమలో భాగమేనని ఆయన తెలిపారు. అందుకే ఆయన సినిమాల్లో లవ్ స్టోరీలకు అంత న్యాచురల్ ఎమోషన్ ఉంటుందని హింట్ ఇచ్చారు.

ఇక్కడ ఎవరి మార్కెట్ వాళ్లదే

Advertisement

అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ఎవరి మార్కెట్ వాళ్లదేనని తేజ స్పష్టం చేశారు. హిట్ వస్తే ఒకలా, ఫ్లాప్ వస్తే మరోలా ఉండొచ్చని, కానీ ఎవరి జర్నీ వాళ్లదేనని చెప్పారు. ఆయన కెరీర్ కూడా అలాగే సాగిందని,. ఎన్ని ఎత్తు పల్లాలు చూసినా తన మార్కు డైరెక్షన్ మాత్రం వదల్లేదని తెలిపారు.ఈ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయమేంటంటే ఫుడ్ వృథా చేయడంపై ఆయన తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.ప్లేట్‌లో కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టుకుని తినకుండా పడేయడం తనకు అస్సలు నచ్చదని తేజ చెప్పారు. మనకు ఎంత కావాలో అంతే తీసుకోవాలని, వృథా చేయకూడదని సింపుల్‌గా తేల్చేశారు.

ఎవరి నమ్మకం వాళ్లదే

ఇక దేవుడిని నమ్ముతారా అని అడిగితే.. “అవును, నమ్ముతాను” అని చెబుతూనే, నమ్మని వాళ్లతో తానెప్పుడూ వాదించనని, ఎవరి నమ్మకం వాళ్లదేనని తెలిపారు .అయితే “మీకు ప్రపంచం గురించి ఇన్ని విషయాలు తెలుసు కదా, మరి మీ ఎమోషన్స్‌ను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు?” అని యాంకర్ ప్రశ్నించగా తేజ ఇచ్చిన రిప్లై అందరినీ ఆలోచనలో పడేసిందనే చెప్పాలి. “ఏదో ఒక రోజు నా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేస్తాను.. కానీ ఆ రోజు వచ్చేసరికి నేను చనిపోయి ఉంటాను” అంటూ తనదైన శైలిలో ఫిలాసఫికల్‌గా చెప్పుకొచ్చారు తేజ.

Advertisement

also read :బాలయ్య అసలు సీక్రెట్ బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ!

నెట్టింట బాగా వైరల్ అవుతున్న కామెంట్స్ 

.ఎంత అనుభవం ఉన్నా మనిషి కోపం, బాధ, ప్రేమ, ఆనందం లాంటి ఎమోషన్స్‌ను పూర్తిగా కంట్రోల్ చేయడం సాధ్యం కాదనే భావన ఆయన మాటల్లో కనిపించింది.మొత్తంగా జీవితాన్ని, మనుషులను తనదైన కోణంలో చూసే తేజ ఇచ్చిన ఈ ఆన్సర్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Tags

Related News

శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!

‘గీతాంజలి’ మళ్లీ వస్తోంది.. ఈసారి 4Kలో! నాగార్జున ఫ్యాన్స్‌కి పండగే

బాలయ్య అసలు సీక్రెట్ బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ!

చెత్త యానిమేషన్ అని తిట్టారు.. రూ.లక్షతో తీస్తే కోట్లు కొల్లగొడుతోంది

విశ్వంభర ..ఒకప్పుడు ఫుల్ హైప్ – ఇప్పుడు నో హోప్ !

‘కాకా’ మెగా 158 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్.. సంబరాలు సిద్ధం చేస్కో!

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా: అనసూయ స్ట్రాంగ్ మెసేజ్

Big Stories

Advertisement
×