BigTV English

Allu Arjun Top Movies OTT: ఓటీటీలో టాప్ 5 అల్లు అర్జున్ మూవీ.. ఫ్యాన్స్ ఓ లుక్ వేసుకోండి..

Allu Arjun Top Movies OTT: ఓటీటీలో టాప్ 5 అల్లు అర్జున్ మూవీ.. ఫ్యాన్స్ ఓ లుక్ వేసుకోండి..

Allu Arjun Top Movies OTT: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) పేరు తెలియని వాళ్ళు ఉండరు. గతంలో అల్లు అర్జున్ నటించిన ఎన్నో సినిమాలు మంచి విషయాన్ని అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ను కూడా రాబట్టాయి. ఈమధ్య వచ్చిన పుష్ప మూవీతో నేషనల్ వైడ్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాడు. రీసెంట్గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అతని రేంజ్ మారిపోయింది. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..


ఆర్య.. 

అల్లు అర్జున్ నటించిన బెస్ట్ మూవీలలో ఆర్య మూవీ ఒకటి. లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఏ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. 21 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన ఈ మూవీ ని డైరెక్టర్ సుకుమార్ రూపొందించారు. ప్రస్తుతం ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది..


వేదం.. 

క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన వేదం మూవీకి ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది. అనుష్క శెట్టి మంచు మనోజ్ లాంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విషయాన్నీ సొంతం చేసుకుంది. ఇప్పటికీ సినిమా టీవీలో వస్తుంటే జనాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఈ మూవీ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతుంది..

ఆర్య 2.. 

బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే. ఆర్య మూవీకి సీక్వెల్ ఆర్య 2. ఈ మూవీకి 7.5 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నవదీప్, అల్లు అర్జున్ నటించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

పుష్ప సిరీస్.. 

అల్లు అర్జున్ ని నేషనల్ వైడ్ గా స్టార్ చేసిన మూవీ పుష్ప.. ఈ మూవీతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈ మూవీ కూడా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి దాని సీక్వెల్ కంటే మంచి ఐఎండీబీ రేటింగ్ ఉంది.. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ అంతకు మించి కలెక్షన్స్ ను రాబట్టింది.. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

అలా వైకుంఠపురంలో.. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన మూవీ అలవైకుంఠపురంలో. సంక్రాంతికి వచ్చి మెగా హిట్ కొట్టిన సినిమా ఇది.. ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. ఇదే కాదు జులాయి సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ఓటీడీలో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు? మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి..

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×