BigTV English

Pawan Kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు.. సింగపూర్ బయలుదేరి పవన్ కళ్యాణ్, చిరు దంపతులు..!

Pawan Kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు.. సింగపూర్ బయలుదేరి పవన్ కళ్యాణ్, చిరు దంపతులు..!

Pawan Kalyan: సింగపూర్ లో రివర్ వ్యాలీలో రోడ్ నెంబర్ 298 లో ఉన్న మూడు అంతస్తుల అపార్ట్మెంట్లో రెండు, మూడవ అంతస్తుల లో స్కూల్ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ అనుకోకుండా ఉదయం 9:45 గంటలకు అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. ఆ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich)ఉన్నారు. ఆ ప్రమాదంలో చిక్కుకున్న బాలుడి కాళ్లు, చేతులకు గాయాలవడమే కాకుండా.. మంటల వల్ల పొగ వ్యాపించడంతో.. ఆ పొగ కాస్త బాలుడి ఊపిరితిత్తుల్లో చేరిందని ,దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో.. హుటాహుటిన మార్క్ శంకర్ ను సిబ్బంది హాస్పిటల్ కి తరలించినట్లు సమాచారం.


ప్రత్యేక ఫ్లైట్ లో సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్, చిరు దంపతులు..

ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో అడవి బిడ్డలతో పర్యటించాల్సిన పర్యటనను నిలిపివేసి సింగపూర్ వెళ్ళిపోవాలని జనసేన నాయకులు, అధికారులు సూచించినప్పటికీ.. తన కొడుకుకి ఏమీ కాదని , మన్యం బిడ్డల సమస్యలే తనకు ముఖ్యమని, మన్యంలో పర్యటన ముగించుకొని.. ఇప్పుడు ప్రత్యేక విమానంలో తన అన్నయ్య చిరంజీవి (Chiranjeevi), ఆయన సతీమణి సురేఖ కొణిదెల (Surekha Konidela) తో కలిసి సింగపూర్ బయలుదేరనున్నట్లు సమాచారం. ఈరోజు రాత్రికి శంషాబాద్ లో ఉన్న తమ ప్రత్యేక ఫ్లైట్ లో వీరు ముగ్గురు సింగపూర్ కి బయలుదేరుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అగ్నిప్రమాదంపై స్పందించిన చిరంజీవి ,మాజీ సీఎం జగన్

ఇకపోతే మార్క్ శంకర్ పవనోవిచ్ కి అగ్నిప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఈ ప్రమాదం పై చిరంజీవి స్పందిస్తూ..” ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, మార్క్ శంకర్ ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపి అభిమానులకు స్వాంతన చేకూర్చారు. ఇక అంతే కాదు మార్క్ శంకర్ పవనోవిచ్ కి జరిగిన అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. “ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి ఇలా అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి షాక్ అయ్యాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పవన్ కుటుంబానికి అండగా ఉంటాము. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాము” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Telugu Heros : అలవాటు లేని యాస…. హీరోలకు ఈ ప్రయోగాలు, కష్టాలు ఎందుకు..?

పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం..

ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. మొదట నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్న ఈయన.. ఆమెతో ఎక్కువ కాలం జీవితాన్ని కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) తో ప్రేమలో పడి సహజీవనం చేసి, పెళ్లికి ముందే అకీరా నందన్ (Akira Nandan) కు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత ఆధ్యా కి జన్మనిచ్చిన ఈ జంట.. ఆ తర్వాత విడిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ రష్యా కు చెందిన అన్నా లెజీనోవా ను వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు పుట్టిన కుమారుడే మార్క్ శంకర్ పవనోవిచ్.. ప్రస్తుతం మార్క్ శంకర్ తల్లితో పాటు సింగపూర్ లో ఉంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×