Costliest OTT Series : ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు ఇళ్లలోనే ఉండి, నచ్చిన సినిమాలను చూస్తూ ఎంటర్టైన్ అయ్యే అవకాశాన్ని అందిస్తున్నాయి. గత సంవత్సరంలో అనేక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. ఇందులో ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన విజువల్స్, యాక్షన్-ప్యాక్డ్ అంశాలు ఉన్నాయి. వివిధ దేశాల నుండి తెరపైకి వచ్చిన ఈ సిరీస్ లు అత్యద్భుతమైన కాన్వాస్, గొప్ప నిర్మాణ విలువలు, భారీ బడ్జెట్ సినిమాలతో ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే ఆడియన్స్ నుంచి కూడా వీటికి మంచి రెస్పాన్స్ దక్కింది. 2025లో రూపొందిన భారీ బడ్జెట్ టాప్ 5 వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
స్ట్రేంజర్ థింగ్స్ 5 నిస్సందేహంగా 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన, చర్చనీయాంశమైన సిరీస్. గత తొమ్మిది సంవత్సరాలుగా అభిమానులకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించిన ఐకానిక్ షో చివరి సీజన్ ఇది. నెట్‌ఫ్లిక్స్ మూడు దశల్లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లను విడుదల చేసి, 2026 మొదటి రోజున సిరీస్‌ను ముగించింది. ఓటీటీ చరిత్రలో అరుదుగా కనిపించే షాకింగ్ బడ్జెట్ ను మేకర్స్ ఈ సిరీస్ కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు 50 మిలియన్లకు పైగా ఖర్చు చేశారని టాక్. మొత్తం బడ్జెట్ 400–480 మిలియన్ల మధ్య ఉండగా, చివరి సీజన్‌కే రూ. 4300 కోట్లు ఖర్చయింది. దీంతో ఇది ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్‌గా నిలిచింది.
స్టార్ వార్స్ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణను పొందింది. అందులో అత్యంత ప్రశంసలు పొందిన స్పిన్-ఆఫ్ సిరీస్‌లలో అండోర్ ఒకటి. జియో హాట్ స్టార్ రెండవ సీజన్ ను ప్రసారం చేసింది. దీని ఖర్చు ఏకంగా 291 మిలియన్లు అంటే రూ. 2400 కోట్లు అని టాక్. ఇది 2025లో రెండవ అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్ 2025 ఏప్రిల్ 22న విడుదలైంది. ఇక ఈ లిస్ట్ లో టాప్-2 లో ఉంది.
సెవెరెన్స్ ఆపిల్ టీవీలో అందుబాటులో ఉన్న మరొక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సిరీస్. ఇందులో కథ లుమోన్ ఇండస్ట్రీస్ అనే వింత కంపెనీ చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగులు తమ వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ ను వేరు చేయడానికి శస్త్రచికిత్స చేయించుకుంటారు. ఫలితంగా రెండు విభిన్న వ్యక్తిత్వాలు ఏర్పడతాయి. ఈ అసాధారణ ప్రయోగం పరిణామాలు ఎలా ఉంటాయన్నదే కథ. 2025 జనవరి 17న ప్రీమియర్ అయిన ఈ సిరీస్ 200 మిలియన్లకు పైగా అంటే రూ. 1800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ టాప్ 3లో ఉంది.
ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ప్లూరిబస్’. అంతరిక్షం నుండి వచ్చి మానవాళిని ప్రభావితం చేసే ఒక మిస్టీరియస్ వైరస్ గురించిన కథను ఇందులో చూడవచ్చు. ఒంటరి మహిళ ఊహించని ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేదాన్ని మేకర్స్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ నవంబర్ 7న ఆపిల్ టీవీలో విడుదలైంది. మొదటి సీజన్ మాత్రమే 135 మిలియన్ల అంటే సుమారు రూ. 1125 కోట్లు బడ్జెట్ తో నిర్మితమైనట్టు సమాచారం. మొత్తం తొమ్మిది ఎపిసోడ్‌లతో ఉన్న ఈ సిరీస్ ఈ సంవత్సరంలో అత్యధిక రేటింగ్ పొందిన షోలలో ఒకటిగా చోటు దక్కించుకుంది. ఈ సిరీస్ బడ్జెట్ పరంగా టాప్ 4లో ఉంది.
ఈ సై-ఫై రివేంజ్ వెబ్ సిరీస్‌ను అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్లాట్‌ఫామ్ HBO విడుదల చేసింది. రెండవ సీజన్ మొత్తం ఏడు ఎపిసోడ్‌లతో ఉంటుంది. 125 మిలియన్లకు పైగా అంటే సుమారు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ రూపొందిందని తెలుస్తోంది. భారతదేశంలో ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇక బడ్జెట్ పరంగా ఇది టాప్ 5లో ఉండడం విశేషం.
Read Also : బ్లూ డ్రమ్ హత్యకేసు ఆధారంగా తెరకెక్కిన ‘హనీమూన్ సే హత్య’ డాక్యుమెంటరీ రిలీజ్ డేట్