Crime Thriller Movie OTT : ఇటీవల ఓటీటీల్లోకి కొత్త సినిమాలు నెల లోపే విడుదల అవుతుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయితే మాత్రం కొన్నిసార్లు రెండు నెలలు కూడా పడతాయి. క్రైమ్ థ్రిల్లర్ కథలతో వచ్చే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ ను రాబడుతుంటాయి. ఇలా కేవలం కొత్త సినిమాలే కాదు పాత సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ను లాక్ చేసుకుంది.. ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి..
మూవీ & ఓటీటీ..
వీటిలో కేవలం సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ కూడా భారీ వ్యూస్ ని రాబడుతూ మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. ఇకపోతే తెలుగులో సరికొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. అదే టచ్ మీ నాట్. గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన టచ్ మీ నాట్ సిరీస్‌లో హీరో నవదీప్‌తోపాటు దీక్షిత శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌కు రమణ తేజ దర్శకత్వం వహించారు. ఈయన తెలుగు ప్రేక్షకులకు సుపరచితమే. గతంలో ఆయన నాగ శౌర్య తో అశ్వత్థామ అనే సినిమాను తెరకెక్కించారు. సునీత తాటి గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన టచ్ మీ నాట్ వెబ్ సిరీస్‌లో నవదీప్, దీక్షిత్ శెట్టితో పాటు కోమలి ప్రసాద్, సంచిత పూనాంచ, హర్షవర్ధన్ వంటి తదితరులు కీలక పాత్రల్లో నటించారు..
ఈ సిరీస్ స్టోరీ విషయానికొస్తే..
ఈ సిరీస్ నుంచి గతంలో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సున్నితమైన క్రైమ్ సంబంధిత విషయం చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుందని అర్థమవుతుంది. ట్రైలర్ లో ధీక్షిత్ శెట్టి సైకోమెట్రిక్ సామర్థ్యాలు కలిగిన పాత్రలో నటిస్తున్నాడు.. ఈ ట్రైలర్ లో చనిపోయిన వారిని అంటే శవాలను పట్టుకొని వారిని ఎవరు చంపారు ఎలా చంపారు అని ఓ చిన్న పిల్లాడు చెప్తాడు ఈ ట్రైలర్ మొత్తం ఇలాంటి సన్నివేశాల్లే కనిపిస్తాయి. అతనికి ఆసక్తి ఎలా వచ్చింది? నిజంగానే అతను నిజం చెప్తున్నాడా లేదా చంపినప్పుడు అతనే అక్కడ ఉండి మరి చూసి ఇలా బయటపెడుతున్నారా అనే విషయాల తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.. ఇది డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక జియో హాట్‌స్టార్‌లో టచ్ మీ నాట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ట్రైలర్ అయితే బాగానే ఆకట్టుకుంది ఇక ఈ సిరీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఏప్రిల్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.. ఏప్రిల్ నెలలో ఎక్కువగా ఓటిటిలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. కొన్ని సినిమాలు డేటు లాక్ చేసుకోగా, మరికొన్ని సినిమాలు త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి..