BigTV English
Advertisement

Fire Accident: షూటింగ్ సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్, ఒకరు మృతి.. 30 లక్షలతో కాంప్రమైజ్ ?

Fire Accident: షూటింగ్ సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్, ఒకరు మృతి.. 30 లక్షలతో కాంప్రమైజ్ ?

Fire Accident : సినిమాల షూటింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా నిర్వహిస్తుంటారు మేకర్స్. చిన్న తప్పు జరిగిన వారు ఏర్పాటు చేసిన భారీ సెట్స్‌లో జరిగే ప్రమాదాలు ఊహించలేకుండా ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి సినిమా సెట్స్‌లో భారీ ప్రమాదాలు జరిగినా అవి బయటికి రాకుండా మ్యానేజ్ చేస్తుంటారు మేకర్స్. తాజాగా ఒక షూటింగ్ సెట్‌లో అదే జరిగింది. ఇటీవల ఒక లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల ఒకరు మృతి చెందారు కూడా. కరెంటు తీగలు తగిలి మనిషి మృతి చెందినా కూడా ఈ విషయం బయటికి రానివ్వకుండా మేకర్స్ జాగ్రత్తపడ్డారు. కానీ ఈ విషయం ఏదో ఒక విధంగా బయటికి వచ్చింది.


డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్

ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుగుతోంది. అందులో మేకర్స్ నిర్లక్ష్యంగా ఉండడంతో కరెంటు తీగ తగిలి ఒక వ్యక్తి మృతి చెందారు. అయితే ఈ విషయం బయటికి రాకుండా, లీగల్ సమస్యలు ఏవీ రాకుండా రూ.35 లక్షలు ఇచ్చి మ్యానేజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు. అయినా కూడా ఇది పోలీసులకు, మీడియాకు తెలియకుండా మూవీ టీమ్ జాగ్రత్తపడుతోంది. ఇలాంటివి ఇంతకు ముందు కూడా చాలా సార్లు జరిగాయి. సినిమా అనేది ఎంత జాగ్రత్తగా తెరకెక్కించినా కూడా ఇలాంటి ప్రమాదాలు కామన్ అయిపోయాయి. అయినా కూడా పలువురు మేకర్స్ ఇంకా నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నారు.


Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను.. కానీ నా తప్పు లేదు.. రౌడీ హీరో స్టెట్‌మెంట్ ఇదే..

స్టార్ హీరోయిన్ సినిమా

ఒక స్టార్ హీరోయిన్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ సెట్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్‌బస్టర్ అయ్యింది. అందుకే ఈ మూవీ సీక్వెల్‌కు మరింత హైప్ తీసుకురావడం కోసం ఇందులో ఒక స్టార్ హీరోయిన్‌ను క్యాస్ట్ చేశారు. దీంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇక స్టార్ హీరోయిన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ షూటింగ్ సెట్‌లో జరిగిన ప్రమాదం గురించి బయటికి రానివ్వకుండా చాలానే జాగ్రత్తపడ్డారు మేకర్స్.

బాధిత కుటుంబంతో కాంప్రమైజ్

అసలైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ ఘటన జరిగి దాదాపు వారం రోజులు అయ్యింది. అప్పటినుండి ఇప్పటివరకు బాధిత కుటుంబ సభ్యులతో మేకర్స్ మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఫైనల్‌గా ఇప్పుడు ఈ విషయం బయటికి రావడంతో ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు నష్టపరిహారంగా రూ. 1 కోటి డిమాండ్ చేసినా రూ.35 లక్షలు ఇచ్చి ఈ విషయం బయటికి రానివ్వకుండా కాంప్రమైజ్ చేసేసుకున్నారు మేకర్స్. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమయ్యింది. ఇటీవల దీనికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

సాయం చేసినవాడికే మరణం

ఈ సినిమా షూటింగ్ సెట్‌లో చనిపోయిన వ్యక్తి ఆ గ్రామానికి చెందిన గ్రామస్తుడే అని తెలుస్తోంది. ఒక గ్రామంలో ఈ సీక్వెల్ షూటింగ్‌కు సంబంధించిన సెట్‌ను ఏర్పాటు చేశారు. ఆ సెట్‌కు కావాల్సిన పర్మిషన్స్‌తో పాటు ఇతర పర్మిషన్స్ కూడా అతడి వల్లే సాధ్యమయ్యాయని సమాచారం. దీని షూటింగ్ కోసం అతడు చాలా సహాయపడ్డాడని తెలుస్తోంది. చివరికి అతడే ఆ సినిమా వల్ల చనిపోయాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×