BigTV English
Advertisement

Tourist Family OTT Review : ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రివ్యూ.. నవ్విస్తూనే కంటతడి పెట్టించే సినిమా..డోంట్ మిస్

Tourist Family OTT Review : ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రివ్యూ.. నవ్విస్తూనే కంటతడి పెట్టించే సినిమా..డోంట్ మిస్

Tourist Family OTT Review : ఈరోజుల్లో మనుషుల మధ్య ప్రేమ అనురాగాలు, సంబంధాలు కనుమరుగయ్యాయి. కేవలం డబ్బుకు దాసోహం అని బ్రతుకుతున్నారు. పైసా విలువ ప్రాణాలకు లేకుండా పోయింది. అలాంటి ఈరోజుల్లో ఓ శరణార్థిగా మన దేశానికిి వచ్చిన కుటుంబం.. తమ చుట్టూ ఉన్న వాళ్లలో ప్రేమానురాగాలను ఎలా నింపిందో చూపించేదే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ.. ఈ మూవీలోని యాక్టర్స్, స్టోరీ, ఓటీటీ వివరాలను ఒకసారి తెలుసుకుందాం..


టూరిస్ట్ ఫ్యామిలీ స్టోరీ విషయానికొస్తే..

కమర్షియల్ చిత్రాలకు ఈరోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలు రావడం మామూలు విషయం కాదు.. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. ధర్మదాస్, వసంతి అనే పాత్రల్లో వీళ్లు కనిపించారు. శ్రీలంకలోని జాఫ్నాకు చెందిన వీళ్లు అక్కడి సంక్షోభ పరిస్థితులను తట్టుకోలేక అక్రమంగా ఓ బోటు ద్వారా ఇండియాలోకి అడుగుపెడతారు.. తమిళనాడులోని ఓ వ్యక్తి సాయంతో బతుకుతెరువు కోసం వస్తారు. అయితే తమ పని తాము చేసుకుంటున్నారు. ఓ రోజు పోలీసులు వాళ్లను పట్టుకున్నా.. ధర్మదాస్, వసంతి చిన్న కొడుకు మురళి తెలివితేటలతో వాళ్ల నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత వాళ్లు కేశవ నగర్ అనే కాలనీలోకి వెళ్తారు. ఓ పోలీసు ఇంట్లోనే భయంభయంగా అద్దెకు దిగుతారు.. అక్కడ వాళ్లు పెద్ద ప్రమాదం నుంచే బయటపడతారు.


కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా బయటకు తెలియనివ్వకుండా నవ్వుతూనే ఉంటారు.. ఆ ప్రాంతంలోకి వాళ్లు వచ్చిన కొద్ది రోజుల్లో అందరికి దగ్గరవుతారు. అయితే రామేశ్వరంలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అక్రమంగా వలస వచ్చిన శ్రీలంక కుటుంబమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి? ఆ టూరిస్ట్ కుటుంబం ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడుతుందో అన్నది స్టోరీ..మిగిలిన స్టోరీ తెలుసుకోవాలంటే మూవీని తప్పక చూడాల్సిందే..

Also Read : కొత్త కోడలికి అమల కండీషన్స్..!

జియో హాట్ స్టార్ ( Jio Hotstar)…

ఈ టూరిస్ట్ ఫ్యామిలీ ఎటువంటి అంచనాలు లేకుండా ఓటీటీ లోకి వచ్చేసింది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా, థియేటర్ రిలీజ్ అనంతరం రూ.60 కోట్ల వసూళ్లతో సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఎటువంటి పెద్ద సీన్లు కూడా ఇందులో లేవు. ఈ మూవీ మొత్తం నవ్విస్తూనే ఏడ్పిస్తుంది.. సినిమా చూస్తున్నంత సేపు మనల్ని వేరే లోకానికి తీసుకొని వెళ్తుంది. ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దుమ్ము దులిపేస్తుంది.. మీరు కూడా ఈ మూవీని జియోహాట్ స్టార్ లో చూసేయ్యండి..

ఇటీవల జియో హాట్ స్టార్ లోకి బోలెడు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి.. అన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కావడంతో మంచి వ్యూస్ ను అందుకుంటున్నాయి. ఈ నెలలో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.

Related News

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

Big Stories

×