BigTV English

Akkineni Amala : కొత్త కోడలికి అమల కండీషన్స్..!

Akkineni Amala : కొత్త కోడలికి అమల కండీషన్స్..!

Akkineni Amala : టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, అమల దంపతుల చిన్న కొడుకు అఖిల్ పెళ్లి తను ప్రేమించిన అమ్మాయి జైనబ్ తో నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖులు హాజరైయ్యారు. జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫొటోలే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. అఖిల్ భార్య గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే అమల కొన్ని కండీషన్స్ పెట్టినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.


అఖిల్ భార్య జైనబ్ బ్యాగ్రౌండ్..? 

టాలీవుడ్ యంగ్ హీరోఅఖిల్.. గతేడాది నవంబరులో జైనబ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగేంతవరకు ఎవరికీ తెలియనంత సీక్రెట్‌గా ఉంటారు.. వీరి పెళ్లి ఎంగేజ్మెంట్ అయిన ఆరు నెలల తర్వాత జరిగింది. ఈ క్రమంలోనే అఖిల్ భార్య జైనబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ జైనబ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చూస్తే.. ఈమె ముంబైకి చెందిన అమ్మాయి. అంతేకాదుపెయింటింగ్ ఆర్టిస్ట్. ఇదివరకే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్, దుబాయిలలో ఎగ్జిబిషన్స్ పెట్టింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్ జుల్ఫీ రవ్జీ కూతురు. ఈమె అన్న కూడా బిజినెస్ మ్యాన్.. జైనబ్ తండ్రి, నాగార్జున స్నేహితులు. అలా వీరిమధ్య ఉన్న స్నేహం కారణంగా కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. అలా అఖిల్-జైనబ్ ఒకరికొకరు పరిచయం.. ఆ తర్వాత మీ ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది అని తెలుస్తుంది. అయితే అఖిల్ వయసు 31 ఏళ్లు కాగా, జైనబ్ వయసు 39 అంటూ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజమేంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..


జైనబ్ కు అమల కండిషన్స్..? 

ఏ ఇంటికైన కొత్త కోడలు వచ్చిదంటే రూల్స్ ఉంటాయి. నేను పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవాలి అని అత్తలు కండీషన్స్ పెడతారు. అలాగే అఖిల్ భార్య జైనబ్ కు అమల కొన్ని కండీషన్స్ పెట్టిందని టాక్. అవేంటంటే.. బయటకు వెళ్ళేటప్పుడు సంప్రదాయంగా కనిపించేలా రెడీ అవ్వాలని చెప్పిందట. అలాగే నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని అందట. ఆ తర్వాత కుకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, భర్తకు దూరంగా ట్రిప్ లకు వెళ్లోద్దని కండీషన్ పెట్టిందట. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి కొత్త కోడలు వీటిని ఫాలో అవుతుందా?లేదా చూడాలి.. అయితే అమల పై సమంత విషయంలో చాలా రూమర్స్ వినిపించాయి. అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read :డైరెక్టర్ మారుతి ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది..?

గ్రాండ్ గా అఖిల్, జైనబ్ రిసెప్షన్ !

అఖిల్ పెళ్లి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియో లో గ్రాండ్గా జూన్ 8న అంటే రేపు రిసెప్షన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారని సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×