OTT Movie : కొన్ని సినిమాలు ఎక్స్‌ట్రీమ్ వయోలెన్స్ కారణంగా చాలా దేశాల్లో బ్యాన్ అవుతుంటాయి. ఈ హింసను గుండె గట్టిగా ఉన్న వాళ్ళు కూడా చూడటం కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాలలో ఒళ్ళు జలదరించే సీన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా 1978 పినోచెట్ డిక్టేటర్‌షిప్ సమయంలో మొదలై 2011లో ఒక రివెంజ్ థ్రిల్లింగ్ తో ముగుస్తుంది. ఇందులో నలుగురు అమ్మాయిలను, ఇద్దరు సైకోలు హింసించే తీరుకు ఈ సినిమాను చాలా దేశాలలో బ్యాన్ కూడా చేశారు. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్
‘ట్రామా’ (Trauma) అనేది ఒక చిలీ ఎక్స్‌ట్రీమ్ హారర్-థ్రిల్లర్ సినిమా. లూసియో ఎ. రోజాస్ డైరెక్షన్‌లో, జువాన్ (డానియెల్ ఆంటివిలో), మారియో (ఫెలిపె రియోస్) కాటలినా మార్టిన్ (ఆండ్రియా), మాకరీనా కారెరె (కామిలా), జిమెనా డెల్ సోలార్ (జూలియా), డొమింగా బోఫిల్ (మాగ్డలీనా) నటనతో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 జనవరి 29న బెర్లిన్‌లో రిలీజ్ అయింది. ప్రస్తుతం Shudder, MUBI, Amazon Prime Video లో స్పానిష్, ఇంగ్లీష్ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 46 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 4.8/10 రేటింగ్ ను పొందింది.
కథ ఏమిటంటే
ఈ స్టోరీ 1978 చిలీలో పినోచెట్ అనే నియంత ఉన్న సమయంలో జరుగుతుంది. ఒక రాజకీయ ఖైదీని టార్చర్ చేసే దారుణమైన సన్నివేశంతో మొదలవుతుంది. ఒక మహిళ ని బంధించి, ఒక సైనిక కమాండర్ తీవ్రంగా హింసిస్తాడు. ఆమె కుమారుడు జువాన్ ని గదిలోకి తీసుకొస్తారు. అతనికి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి, తల్లిని బలవంతం చేయమని వేధిస్తారు. ఈ దారుణ సన్నివేశంలో, కమాండర్ ఆమె తలపై కాల్చి చంపుతాడు. ఈ సంఘటన జువాన్ మనస్సుపై శాశ్వత గాయాన్ని మిగిలిస్తుంది. అతన్ని ఒక సైకోగా మారుస్తుంది.
కథ 2011 లోకి మారుతుంది. ఇక్కడ ఆండ్రియా, కామిలా, కామిలా, జూలియా, మాగ్డలీనా అనే అమ్మాయిలు ఒక సంతోషకరమైన వీకెండ్ కోసం చిలీ గ్రామీణ ప్రాంతంలోని ఒక ఒంటరి కాటేజీకి వెళతారు. వారు వైన్ తాగుతూ, పార్టీ చేస్తూ ఆనందిస్తుంటారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు ఉండదు. వీళ్లంతా ఒక స్థానిక బార్‌లో ఇప్పుడు పెద్దవాడైన జువాన్ , అతని కుమారుడు మారియోని కలుస్తారు. ఈ ఇద్దరు 1978లో జువాన్ కి జరిగిన దారుణ సంఘటన వాళ్ళ, ఆడవాళ్లను ద్వేషించే వికృత మనస్తత్వం కలిగి ఉంటారు. బార్‌లో ఒక సమావేశం తర్వాత, జువానిటో, మారియో రాత్రి సమయంలో కాటేజీకి చొరబడతారు. ఆ నలుగురు మహిళలపై హింసాత్మక దాడిని చేస్తారు.
ఈ దాడిలో అఘాయిత్యం టార్చర్ వంటి హింస ఎక్కువగాఉంటుంది. ఇది చూడటానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది.ఈ దాడి తర్వాత, మాగ్డలీనా అక్కడి నుంచి తప్పించుకోగలుగుతుంది. కానీ సహాయం కోసం స్థానిక గ్రామానికి చేరుకున్నప్పుడు, గ్రామస్తులు నిర్లక్ష్యం చేస్తారు. మిగిలిన మహిళలు, తీవ్రమైన శారీరక, మానసిక గాయాలతో, స్థానిక పోలీసు అధికారి పెడ్రో సహాయంతో, జువాన్, మారియోను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటారు. ఈ అమ్మాయిలు చివరికి వీళ్ళ పై రివేంజ్ తీర్చుకుంటారా ? ఆ సైకోలకి బలవుతారా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్