Hyderabad News: ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్యకాలంలో తరచూ దాడులు జరుగుతున్నాయి. ప్రాంతం ఏదైనా ఇలాంటి ఘటనలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆర్టీసీ సిబ్బంది షాకయ్యారు. అసలేం జరిగింది.
హైదరాబాద్ సిటీలోని రద్దీ ప్రాంతాల్లో మెహిదీపట్నం ఒకటి. బస్టాప్ సమీపంలో రైతుబజారు కూడా ఉంటుంది. దీంతో బస్సు ఎక్కేవారు.. మార్కెట్‌కి వచ్చేవారితో ఆ ప్రాంతం నిత్యం కళకళలాడుతోంది. అంతేకాదు ఆ సమీపంలో బస్సుల యూటర్న్ కూడా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది కూడా. రేతిబౌలి వద్ద కాసేపు ట్రాఫిక్ జామ్ అయితే మెహిదీపట్నం వరకు అది కంటిన్యూ అవుతుంది.
ట్రాపిక్ జామ్ విషయాన్ని కాసేపు పక్కనబెడితే.. అసలు విషయానికొద్దాం. హారన్ కొట్టాడని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్. ఈ ఘటన మెహదీపట్నం రైతుబజార్ సమీపంలో చోటు చేసుకుంది. ఆటో సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టాడు బస్సు డ్రైవర్. దీంతో ఆగ్రహానికి గురయ్యాడు ఆటో డ్రైవర్.
ఆటో ఆపిన డ్రైవర్, పరుగెత్తుకుంటూ బస్సు డ్రైవర్ కిటికీ వైపు ఎక్కి కొట్టాడు. పరిస్థితి గమనించిన డ్రైవర్.. బస్సుని ఆపాడు. ఆ తర్వాత కిటికీ పట్టుకుని బండ బూతులతో ఆర్టీసీ డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు ఆటోవాలా. అంతటితో ఆగకుండా బస్సు ఎక్కి డ్రైవర్‌పై దాడి చేశాడు. ఈ ఘటనపై కండక్టర్ జోక్యం చేసుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ALSO READ: రూ. లక్షలు చెల్లించాల్సిందే.. ఆర్టీసీ డ్రైవర్‌కు కోర్టు ఆదేశం
బస్సులో జరిగిన ఓ ఘటనపై ఓ వ్యక్తి తమ సెల్‌ఫోన్ ద్వారా షూట్ చేశాడు. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెహదీపట్నం సీఐ తెలిపారు. కేవలం ఇదొక్కటి మాత్రమే కాదు.. మెహిదీపట్నం ఏరియాలో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటున్నాయి. దీనిపై ఆర్టీసీ సిబ్బంది బెంబేలెత్తుతున్నారు.
కొద్దరోజుల కిందట రేతిబౌలి సిగ్నల్ దాటిన తర్వాత ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అప్పుడు కూడా ఆటో డ్రైవర్.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేశాడు. ఈ తతంగాన్ని కండక్టర్ వీడియోలో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఘటన గురించి తోటి సిబ్బంది తెలిపాడు. ఈ ఏరియాల్లో జాగ్రత్త, బస్సులను వెంటాడి మరీ కొడుతున్నారని చెప్పుకొచ్చాడు.
హారన్ కొట్టాడని.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి!
హైదరాబాద్-మెహదీపట్నం రైతుబజార్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన
ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టిన బస్సు డ్రైవర్
దీంతో ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్.. బస్సు వద్దకు వెళ్లి డ్రైవర్ సీటు కిటికీ పట్టుకుని బూతులతో… pic.twitter.com/uSK9CzEw6H
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025