E-Paper
Advertisement

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్
Advertisement

OTT Movie : మలయాళం సినిమాలను ఆసక్తిగా గమనిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే వీటిపై ఓ లుక్ వేస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలను మాత్రం మిస్ కాకుండా చూస్తున్నారు. మరి ఈ సినిమాలు కూడా సరికొత్త కంటెంట్ తో వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే థ్రిల్లర్ సినిమా ఒక యువతి జీవితంలో ఒక రాత్రి జరిగిన ట్రాజెడీ, ఆమె గతంలోని రహస్యాల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా సస్పెన్స్, ఎమోషన్స్, సోషల్ ఇష్యూస్‌ని మిక్స్ చేస్తుంది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

Advertisement

‘ఇన్’ (In) ఒక మలయాళ థ్రిల్లర్ సినిమా. రాజప్రసాద్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో దీప్తి సతి, సామ్యూల్ జాన్, వినోద్ థామస్, కైనాజ్ మొటీవాలా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 జనవరి 28న థియేటర్‌లో రిలీజ్ అయ్యి, తర్వాత 2022 మార్చిలో అయ్యింది. 122 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.8/10 రేటింగ్ ను పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

ఈ స్టోరీ రాణి అనే యువతితో మొదలవుతుంది. రాణి తన గతంలో ఒక బాధాకరమైన సంఘటనతో సతమతమవుతుంటుంది. ఆ విషయం ఆమెను ఇంకా వెంటాడుతుంది. ఆమె కేరళలోని ఒక ఇంట్లో ఒక రాత్రి గడుపుతుంది. ఆ రాత్రి ఇంట్లో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతాయి. ఎవరో తలుపు తడుతున్నట్టు, ఇంట్లో వింత శబ్దాలు, లైట్స్ ఆగిపోవడం. ఈ సంఘటనల మధ్య, ఒక అమ్మాయి మృతదేహం ఇంటి దగ్గర కనిపిస్తుంది. ఇది రాణిని షాక్‌లో పడేస్తుంది. ఒక పోలీసు ఆఫీసర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు. కానీ రాణి గతంలో ఒక రహస్యం ఉందని, ఈ హత్యతో దానికి సంబంధం ఉందని తెలుస్తుంది. రాణిపై గతంలో అఘాయిత్యం జరిగిఉంటుంది. ఆ సంఘటన ఆమెను మానసికంగా బాధిస్తుంటుంది. ఈ కొత్త హత్య కేసు, ఆమె గతంలోని సంఘటనతో ఎలా ముడిపడిందనే రహస్యం సినిమా మొత్తం సస్పెన్స్‌తో నడిపిస్తుంది.

ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్నప్పుడు, రాణి స్నేహితురాలు ఆమెకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ కేసులో ఆమెకు కూడా ఏదో సంబంధం ఉందని బయటపడుతుంది. పోలీసు ఆఫీసర్, రాణిపై గతంలో జరిగిన దాడి గురించి తెలుసుకుంటాడు. అది ఈ కొత్త హత్యతో ఎలా కనెక్ట్ అయ్యిందో ఛేదించడానికి ట్రై చేస్తాడు. క్లైమాక్స్‌లో హత్య వెనక ఉన్న నిజం, రాణి గతంతో దాని కనెక్షన్ బయటపడుతుంది. ఇంతకీ ఈ హత్యకు, రాణి గతానికి సంబంధం ఏమిటి ? ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడతాయి ? రాణిపై అఘాయిత్యం చేసింది ఎవరు ? అనే విషయాలను ఎలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : అక్క పెళ్లి చేసుకోవాల్సిన వాడితో ఆ పని చేసే చెల్లి… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ క్రైమ్ డ్రామా

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×