OTT Movie : హిస్టారికల్ సినిమాలు ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటాయి. స్టోరీ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలతో ఈ సినిమాలు పిచ్చెక్కిస్తాయి. 17వ శతాబ్దంలో ఈ మూవీ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. పిల్లల కోసం ఒక ధనవంతుడు పడుచు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమె మరొక యువకుడితో ప్రేమలో పడుతుంది. మూవీ స్టోరీ చివరి వరకు మలుపులతో ఇంట్రెస్టింగా సాగుతూ ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘తులిప్ ఫీవర్’ (Tulip fever). 2017 లో రిలీజ్ అయిన ఈ మూవీకి జస్టిన్ చాడ్విక్ దర్శకత్వం వహించారు. ఇందులో అలిసియా వికందర్, డేన్ డెహాన్, జాక్ ఓ’కానెల్, హాలిడే గ్రేంగర్, టామ్ హోలాండర్, మాథ్యూ మోరిసన్, కెవిన్ మెక్‌కిడ్, డగ్లస్ హాడ్జ్, జోవన్నా స్కాన్లాన్, జాచ్ గలిఫియానాకిస్ నటించారు. ఆమ్‌స్టర్‌డామ్‌లోని 17వ శతాబ్దపు చిత్రకారుడిని ఈ మూవీ అనుసరిస్తుంది. అతను ఒక వివాహిత స్త్రీతో ప్రేమలో పడతాడు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
సోఫియా అనాధ కావడంతో చర్చిలో నన్ గా ఉంటూ జీవిస్తూ ఉంటుంది. ధనవంతుడైన కోర్నాలస్ పిల్లల కోసం ఆమెను పెళ్లి చేసుకుంటాడు. చర్చి వాళ్ళు ఆమెను ఇతనికి అమ్మేస్తారు. కోర్నాలస్ కి వయసు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతనికి ఇదివరకే పెళ్లి కూడా జరిగి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో భార్య చనిపోయి ఉంటుంది. అయితే కోర్నాలస్ దగ్గర మరియ అనే పనిమనిషి కూడా ఉంటుంది. ఆమె విలియం అనే అతనితో రహస్యంగా వ్యవహారం నడుపుతూ ఉంటుంది. ఆ కాలంలో తులిప్ పువ్వులకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ కొన్నిపూలు దొరికినా వాళ్ళు ధనవంతులవుతారు. విలియం ఆ పువ్వులను సంపాదించి, పెద్ద ధనవంతుడు అవ్వాలనుకుంటాడు. ఆ తర్వాత మరియాని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు.
మరోవైపు సోఫియా జాన్ అనే ఆర్టిస్ట్ తో ప్రేమలో పడుతుంది. వీళ్ళిద్దరూ కోర్నాలస్ కి తెలియకుండా ఏకంతంగా గడుపుతూ ఉంటారు. ఆ ముసలోడు ఎంత ప్రయత్నించినా సోఫియా ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతుంది. అయితే పనిమనిషి మరియా, విలియం వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. విలియం ఆ తర్వాత కనిపించకుండా పోతాడు. అప్పుడు సోఫియా ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఆ బిడ్డ నాకు పుట్టినట్టు మరియాను నటించమంటుంది. ఆ పుట్టబోయే బిడ్డ తనకే పుట్టాడని కోర్నాలస్ కూడా అనుకుంటాడు. చివరికి ఈ వ్యవహారం కోర్నాలస్ కి తెలుస్తుందా ? సోఫియా, జాన్ల లవ్ స్టోరీ ఏమవుతుంది? విలియం మళ్లీ మరియా కోసం తిరిగి వస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, ‘తులిప్ ఫీవర్’ (Tulip fever) అనే ఈ రొమాంటిక్ మూవీని చూడండి.