E-Paper
Advertisement

సూరికి హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ?

సూరికి హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ?
Advertisement

Surender Reddy :హిట్టు ..ఒకే ఒక హిట్టు ..ఇండస్ట్రీలో గేట్లు బార్లా ఓపెన్ చేస్తుంది.కనిపించిన ప్రతీ వాడితో సలాం కొట్టిస్తుంది, వద్దంటున్నా అడ్వాన్స్ లు ఆగమేఘాల మీద వచ్చిపడుతుంటాయి.ఇక మాతో సినిమా అంటే మాతో సినిమా చేయుమని పెద్ద పెద్ద హీరోలే క్యూ కట్టేస్తుంటారు.

ఇండస్ట్రీలో హిట్టు కొడితే జరిగే మ్యాజిక్ ఇదీ.కాని ప్లాప్ అదీకూడా సూపర్ డూపర్ ప్లాప్ వచ్చి పడితే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు.సింపుల్ గా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిని చూపించవచ్చు.

బొక్క బోర్లా పడ్డ ఏజెంట్

Advertisement

అఖిల్ అక్కినేని తో ak ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఇంకేం స్టార్ డైరెక్టర్ అయిన సూరి కాస్తా సైలెంట్ కావాల్సిన పరిస్థితి. సినిమా వచ్చి నాలుగేళ్ళు దాటుతున్నా ఇప్పటికీ ఒక్క సినిమాని కూడా పట్టాలెక్కించలేక పోయాడు.దాదాపు 70కోట్లతో తెరకెక్కిన ఏజెంట్ సినిమా పట్టుమని పాతిక కోట్లని వేనుకేసుకోకపోవడంతో సూరి దిక్కు చూసేవాళ్ళే లేకుండా పోయారు.

also read :‘ఏషనాగుల’పై ట్రోలింగ్ మొదలు.. ఇదేం ఫోక్ సాంగ్ రా బాబూ!

సినిమా ఉంటుందా లేదా

Advertisement

మొత్తానికి ఏదోలా వక్కంతం వంశీ కథతో ‘జైత్ర రామ మూవీస్’బ్యానర్ మీద పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ తాళ్ళూరి నిర్మాతగా ఈ ఏడు న్యూ ఇయర్ సందర్భంగా ఒక సినిమాని మొదలెట్టబోతున్నామంటూ అనౌన్స్ కూడా చేశారు.ఇక పవన్ కెరీర్ లో 32వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాలో ఫౌజీ బ్యూటీ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుందని, ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్యామియో లో కనిపించబోతున్నాడంటూ వార్తలు ఇబ్బడి ముబ్బడిగా చక్కర్లు కొట్టాయి.అయితే ఆ తర్వాత సినిమా నుండి ఎలాంటి ప్రోగ్రెస్ అప్ డేట్స్ వదలకపోవడంతో సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు మూవీ లవర్స్ .

ఒక మీడియం రేంజ్ హీరోతో

మరో వైపు ఓజీ వంటి సాలిడ్ హిట్ అందించిన సుజిత్ తో ఓజి 2 ఖచ్చితంగా ఉంటుందని పలు స్పష్టం చేసిన పవన్ సూరితో సినిమా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోయాడు.ఇక తాజాగా వినిపిస్తున్న వార్తలని బట్టి చూస్తే పవన్ సూరితో సినిమా చేసే అవకాశం లేదని, అందుకే సూరి పెద్ద హీరోలని నమ్ముకోకుండా ఒక మీడియం రేంజ్ హీరోతో సరికొత్త కథని సెట్స్ మీదకి తీసికెళ్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ .నిజానికి సూరికి గనుక గత సినిమా సక్సెస్ అయ్యుంటే పవన్ సూరిని ఇన్ని రోజుల పాటు వెయిట్ చేయించి ఉండేవాడా అంటే కాదనే మాటే ఎక్కువ వినిపిస్తుంది.

also read :కాకా కథ ఇదేనా …మెగా 158 స్టోరీ లీక్ ?

ఎవరు డేట్స్ అప్పనంగా అప్పజెబుతారో !

ఏది ఏమైనా అతనొక్కడే, రేసుగుర్రం, కిక్, ధ్రువ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ లని తెరకెక్కించిన సూరి ఇలా ఒక్క సినిమాని సెట్స్ పైకి తీసికెళ్ళడానికి ఇలా ఏళ్ళకి ఏళ్ళు ఎదురుచూడటం నిజంగా బాధాకరం. చూడాలి మరి సూరి టేకింగ్ ని నమ్మి ఈ సారి ఎవరు డేట్స్ అప్పనంగా అప్పజెబుతారో !

Tags

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×