OTT Movie : టీనేజ్ లో అడుగు పెట్టేటప్పుడు తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఆ వయసులో పిల్లలు రకరకాల ఊహల్లో తేలుతూ ఉంటారు. శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో బ్యాలెన్స్ తప్పితే, పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా చాలా నష్టమే జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో 16 వయసు కూడా దాటకుండానే ప్రెగ్నెంట్ అవుతుంది ఒక అమ్మాయి. తనని ప్రెగ్నెంట్ చేసింది కూడా అదే వయసు కుర్రాడు. ఆ తర్వాత వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులతో స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
2019 లో వచ్చిన ఈ ఇండోనేషియన్ టీన్ డ్రామా మూవీ పేరు ‘టూ బ్లూ స్ట్రైప్స్’ (Two Blue Stripes). ఈ మూవీకి గినా ఎస్. నోయర్ దర్శకత్వం వహించారు. ఈ ఇండోనేషియన్ మూవీని స్టార్‌విజన్ ప్లస్ నిర్మించింది. ఈ మూవీ యుక్తవయస్సులో గర్భం తెచ్చుకున్న ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
డార అనే అమ్మాయి స్కూల్లో చదువుతూ ఉంటుంది. బిరా అనే అబ్బాయి కూడా ఆమెతో పాటు చదువుతూ ఉంటాడు. వీళ్ళిద్దరి వయసు 16 కూడా దాటదు. అయితే డార ఒక సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. తన మీద తల్లిదండ్రులు చాలా ఆశలు కూడా పెట్టుకుంటారు. మరోవైపు బిరా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. వీళ్ళకు తినడానికి కూడా సరిగ్గా ఉండవు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడి, అన్ని పనులు కానిస్తారు. అయితే అనుకోకుండా ఒక రోజు డారా ప్రెగ్నెంట్ అవుతుంది. ఇది తెలిసి అందరూ షాక్ అవుతారు. రెండు కుటుంబాలు ఈ విషయంలో ఆందోళన చెందుతాయి. ఆ తర్వాత డారను తల్లి దండ్రులు మందలించి, అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. బిరా ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పకపోవడంతో, ఆమెను అతని ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది.
ఆ తరువాత ఇద్దరూ చదువుకోవడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో పరిస్తితులను ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటారు. చివరికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా? డార పిల్లాడిని కంటుందా ? వీరి లైఫ్ ఎటు పోతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘టూ బ్లూ స్ట్రైప్స్’ (Two Blue stripes) అనే ఈ టీన్ రొమాంటిక్ మూవీని చూడండి. అప్పట్లో ఈ మూవీ గురించి ఇండోనేషియన్ లో తీవ్రమైన చర్చ కూడా జరిగింది. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పుస్తకాలలో చెప్పాలని డిమాండ్ కూడా బాగా పెరిగింది. అయితే ఈ మూవీ ఇండోనేషియాలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.