BigTV English

OTT Movies : ఆరు రోజుల్లోనే ఓటీటీలోకి యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఆరు రోజుల్లోనే ఓటీటీలోకి యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ మధ్య ఓటీటీలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు కావడం విశేషం. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోపోయే సినిమా రిలీజ్ అయ్యి ఆరు రోజుల్లోనే ఓటిటి లోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురైయ్యేలా చేస్తుంది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


మూవీ& ఓటీటీ..

ఇటీవల రిలీజ్ అయిన మలయాళ సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. సూపర్ హిట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయిపోయింది. బ్లాక్‍బస్టర్ సాధించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలో కి ఎంట్రీ ఇవ్వనుంది.. ఇక కుంచకో బోబన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న మలయాళం రిలీజై బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.. నిజం చెప్పాలంటే ఇటీవల థియేటర్లలోకి వచ్చిన సినిమాలు సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటే మాత్రం దాదాపు నెల రోజులకు పైగా కూడా ఓటీటీలోకి దర్శనం ఇవ్వవు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ మాత్రం రిలీజ్ అయిన వారంలోపలే ఓటీటీలో కి రావడం విశేషం.. మార్చి 20 వ తారీఖున ఓటీటీలోకి అర్ధరాత్రి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది..


కుంచాకో బోబర్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ మలయాళంలో ఫిబ్రవరి 20న విడుదలైంది. అక్కడ మంచి టాక్ రావడంతో తెలుగులో దీనిని డబ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో మార్చ్ 14 న డబ్ చేశారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇది మార్చి 20 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అంటే తెలుగు వర్షన్ విడుదలైన ఆరు రోజులకే ఓటీటీ లో వచ్చేస్తోందన్నమాట.. ఒక్క ఆఫీసర్ మూవీ నే కాదు ఇలా చాలా సినిమాలు ఓటీటీలో త్వరగా రిలీజ్ అవుతున్నాయి..

Also Read :సర్జరీల కోసం లక్షలు వదులుకున్న స్టార్ హీరోయిన్లు.. ఎవరెవ్వరో తెలుసా..?

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీ స్టోరీని చూస్తే.. గోల్డ్ చైన్ దొంగతనం, ఓ అమ్మాయి అనుమాస్పద మరణం, పోలీస్ ఆత్మ హత్య లాంటి ట్విస్టుల తో ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ సాగుతుంది. ఈ కేసును ఓ పోలీస్ దర్యాప్తు చేయడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది.. ఈ కేసును పోలీసులు ఎలా చేదించారు అన్నది మూవీ స్టోరీ.. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు వంద శాతం పెర్ఫార్మన్స్ ఇచ్చారు.. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి…

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×