E-Paper
Advertisement

ప్రతి క్రైమ్ కళ్లముందే రీప్లే… అరుదైన కథ… అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

ప్రతి క్రైమ్ కళ్లముందే రీప్లే… అరుదైన  కథ… అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్
Advertisement

Crime Mystery Series OTT : ఒక క్రైమ్ జరిగింది. పోలీసులకు సాక్షులు ఉన్నారు, ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కళ్లముందు జరిగినట్టే గుర్తు పెట్టుకునే పోలీస్ ఆఫీసర్ ఉంటే ? ఆమె చూసిన ముఖం, విన్న మాట, కనిపించిన చిన్న వస్తువు… ఏదీ మర్చిపోకుండా గుర్తుంటే ? అదే ‘Unforgettable’లో క్యారీ వెల్స్‌కు ఉన్న ప్రత్యేకత. కానీ తనకు జరిగిన ప్రతిదీ గుర్తున్నా… తన సోదరి హత్య వెనుక నిజం మాత్రం ఎందుకు గుర్తు రావడం లేదు ? అన్న ప్రశ్నే సిరీస్ ‌లో మరో పెద్ద మిస్టరీ. మరి కథలో ఏం జరుగుతుందో చూద్దాం.

కథలోకి వెళ్తే…

క్యారీ వెల్స్ ఒక పోలీస్ డిటెక్టివ్. ఆమెకు hyperthymesia అనే అరుదైన మెమరీ కండిషన్ ఉంటుంది. అంటే తన జీవితంలో జరిగిన సంఘటనలను అసాధారణంగా స్పష్టంగా గుర్తుపెట్టుకోగలదు. ఉదాహరణకు ఓ క్రైమ్ సీన్‌ కు వెళ్లిందనుకోండి. అక్కడ ఎవరెవరు ఉన్నారు ? టేబుల్‌ పై ఏ వస్తువు ఉంది ? ఎవరు ఏ దుస్తులు వేసుకున్నారు ? ఏ సమయంలో ఏం జరిగింది ? ఇలాంటి చిన్న విషయాలు కూడా ఆమెకు గుర్తుంటాయి. ఇతరులకు పెద్దగా ఉపయోగం లేని క్లూ… క్యారీకి మాత్రం కేసును ఛేదించే కీలక ఆధారంగా మారుతుంది.

Advertisement

అందుకే ఆమె పోలీస్ ఇన్వెస్టిగేషన్స్‌ లో చాలా ఉపయోగపడుతుంది. కానీ క్యారీకి తన జీవితంలో ఓ బాధ మాత్రం ఉంటుంది. తన సోదరి రాచెల్ హత్యను ఆమె స్వయంగా చూసింది. అయినా ఆ హత్యకు కారణమైన వ్యక్తిని ఇప్పటికీ పూర్తిగా గుర్తించలేకపోతుంది. ఇదే ఆమెను వెంటాడే అతిపెద్ద ప్రశ్న. ఒకవైపు రోజూ కొత్త కొత్త క్రైమ్ కేసులు వస్తుంటాయి. వాటిని తన అసాధారణ మెమరీతో సాల్వ్ చేస్తుంది. మరోవైపు తన సోదరి హత్యకు సంబంధించిన గతాన్ని కూడా మళ్లీ మళ్లీ వెతుకుతూనే ఉంటుంది.

ఇక్కడే సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఎందుకంటే క్యారీకి ఏదైనా మర్చిపోయే సమస్య లేదు. కానీ అన్నీ గుర్తున్న వ్యక్తికి కూడా ఒక ముఖ్యమైన నిజం దొరకకపోతే… అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఇంతకీ ఆమె సోదరి హత్యకు కారణం ఎవరు ? వాళ్ళని హీరోయిన్ కనిపెట్టగలిగిందా ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

Advertisement

Also Read : ప్రతి క్రైమ్ కళ్లముందే రీప్లే… అరుదైన కథ… అదిరిపోయే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

‘అన్ఫర్గెటబుల్’ 2011లో CBSలో ప్రారంభమైన అమెరికన్ క్రైమ్ డ్రామా. Poppy Montgomery క్యారీ వెల్స్‌గా, Dylan Walsh అల్ బర్న్స్‌గా ప్రధాన పాత్రల్లో నటించారు. Ed Redlich, John Bellucci ఈ సిరీస్‌ను డెవలప్ చేశారు. 2011 సెప్టెంబర్ 20న ప్రీమియర్ అయింది. మొత్తం 4 సీజన్లలో 61 ఎపిసోడ్లు ఉన్నాయి. Netflixలో అందుబాటులో ఉన్న వెర్షన్‌ ను క్రైమ్, మిస్టరీ ఇష్టపడేవాళ్లు ట్రై చేయొచ్చు. అయితే తాజాగా ఓటీటీలోకి వచ్చిన సీజన్ మాత్రం ఇంగ్షీషులోనే ఉంది.

Tags

Related News

ప్రైవేట్ వీడియో లీక్… బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య భయంకరమైన బ్లాక్‌మెయిల్ గేమ్

పెళ్లి ఫిక్స్ చేసుకోవడానికి ఒకే చోట 14 మంది… ‘బిగ్ బాస్’ను మించిన రొమాన్స్, గొడవలు… సింగిల్స్ రచ్చ పీక్స్ మావా

సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్… మైండ్ బ్లోయింగ్ పవర్స్ తో రివేంజ్… ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ తెలుగులో

వీడియో గేమ్‌ లా మనుషుల ప్రాణాలతో ఆడుకునే దేవుడు… క్రేజీ కాన్సెప్ట్… ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు

తేజ సజ్జ ‘ది ట్రేటర్స్’ తెలుగు ట్రైలర్ చూశారా? 20 మంది సెలబ్రిటీలు వీళ్లే!

నడిసముద్రంలో మిస్సింగ్ షిప్… తలుపు తీసి చూస్తే కళ్లు తేలేసే సీక్రెట్స్…’డార్క్’ మేకర్స్ మైండ్-బెండింగ్ మిస్టరీ

7 ఇయర్స్ మిస్సింగ్… పుట్టుకతో గుడ్డిదైన పిల్ల తిరిగొచ్చేసరికి కంటిచూపుతో… మెంటల్ మాస్ సిరీస్ మావా

Big Stories

Advertisement
×